శ్రీ కృష్ణావతారం 3 మథురకు నారదుడు వచ్చుట ఒకనాడు నారదమహర్షి కంసుడి ఇంటికి విచ్చేసాడు. కంసుడితో ఏకాంతంగా “రాజాకంస! వ్రేపల్లెలో ఉన్న నందుడూ మొదలగువారూ, వారి భార్యలూ, బంధువులూ, దేవకి మొదలైన స్తీలూ, వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవమాతృలు కారు. నీవు రాక్షసుడవు. సర్వదేవతామయుడు అయిన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడుచేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు.” అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న కంసుడు, యాదవులు దేవతలని; శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని; తలచాడు. ఎంతో ఆరాటం పొంది, మనసులో.... దేవకీవసుదేవుల చెరసాల ఈవిధంగా తలచుకొని మనస్సులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీవసుదేవులను పట్టి బంధించాడు. వారిపుత్రులను విష్ణుస్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు.విజృంభించి యదు భోజ అంధక దేశాల నేలుతున్న తనతండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుపట్టి శూరసేనదేశాలకు తానే రాజై పరిపాలించాడు. ఇలా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడకట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడ...