శివోహమ్ శివోహమ్ శివోహమ్..... జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి..?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం. శివోహమ్ శివోహమ్ శివోహమ్... మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్ న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివో...
మన ధార్మిక గ్రంధాల్లో ఉన్న చాలా విషయాలు మీకు అందజేస్తాం. స్తోత్రాలు ధర్మ సందేహాలు తెలుసుకుందాం వ్రతములు కథలు దర్శనీయ క్షేత్రాలు చిత్ర మాలిక పండుగలు బోధనలు వీడియోలు For any information email : Sachin.srirambhatla@gmail.com
శ్రీ కృష్ణావతారం 1 సకల పురాణాలనూ వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూతమహర్షి, గొప్ప గుణాలచేత ఉత్తములైన శౌనకాది మహర్షులతో ఈ విధంగా అన్నాడు. "పరీక్షిన్మహారాజు శుకమహర్షిని చూసి ఇలా పలికాడు. నీవు సూర్యవంశ చంద్రవంశాల విస్తారాలను తెలియ జెప్పావు. ఆ వంశాలలో పుట్టిన రాజుల చరిత్రలు చక్కగా చెప్పావు. మేము విన్నాము. వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి. శ్రీమహా విష్ణువు మహాత్ముడూ, ఈ లోకాలకు ఈశ్వరుడూ. ఆయన శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు. అలా పుట్టి ఏవిధంగా ప్రవర్తించాడు. ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేసాడు. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది. శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసారబాధలకు ఔషధం. చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది. మోక్షం అర్థించే జనులకు కోరదగినది. అటువంటి హరిస్తోత్రం విని ఇంకచాలు అనేవాడు ఎవడూ ఉండడు. మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆమాట ఎవరూ అనరు. భీష్మాది కురువీరులతో నిండిన కౌరవసైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది. అలాంటి కౌరవసేనాసముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు. ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు. నేన...
కామెంట్లు