పోస్ట్‌లు

మన ధార్మిక గ్రంధాల్లో ఉన్న చాలా విషయాలు మీకు అందజేస్తాం. స్తోత్రాలు ధర్మ సందేహాలు తెలుసుకుందాం వ్రతములు కథలు   దర్శనీయ క్షేత్రాలు చిత్ర మాలిక  పండుగలు బోధనలు వీడియోలు For any information email : Sachin.srirambhatla@gmail.com 

SRIMADRAMAYANA (Sundarakanda)by Chaganti Koteswara Rao Garu

SRIMADRAMAYANA S1 SRIMADRAMAYANA S2 SRIMADRAMAYANA S3 SRIMADRAMAYANA S4 SRIMADRAMAYANA S5 SRIMADRAMAYANA S6 SRIMADRAMAYANA S7 SRIMADRAMAYANA S8

శివోహమ్ శివోహమ్ శివోహమ్.

శివోహమ్ శివోహమ్ శివోహమ్..... జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి..?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం. శివోహమ్ శివోహమ్ శివోహమ్... మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్ న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్  శివోహమ్ శివోహమ్ శివోహమ్ న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు చిదానంద రూపః శివోహమ్ శివోహమ్  శివోహమ్ శివోహమ్ శివోహమ్ న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్  శివోహమ్ శివోహమ్ శివో

శ్రీ కృష్ణావతారం 5

చిత్రం
శ్రీ కృష్ణావతారం 5 దేవకి కృష్ణుని కనుట పద్మం వంటి ముఖం గల దేవకి కృష్ణుని కనుటకు ప్రసవవేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి. దేవకీదేవి శ్రీకృష్ణభగవానుని ప్రసవిస్తున్నట్టి ఆ సమయంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేసాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్ని దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళ లాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలుతో భూదేవి వెలిగి పోయింది. పక్షుల కిలకిలారావాలతో, పూలతో పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు.శ్రేష్ఠులైన గంధర్వులు (నారద, చిత్రసేనాదులు) దివ్యగానాలు చేసారు; రంభ మొదలైన అప్సరసలు నృత్యాలు చేసారు; సిద్ధులు అనే దేవతలు ఆనందంతో గుంపులు గుంపులుగా చేరారు; చారణులు అనే దేవతలకు భయం తీరి ఆనందించారు; దేవతలు ఉత్సవంగా భేరీలు మోగించారు;అలాంటి సమయంలో:దేవ

శ్రీ కృష్ణావతారం 4

చిత్రం
శ్రీ కృష్ణావతారం 4 బ్రహ్మాదుల స్తుతి మధురలో పరిస్థితి ఇలా ఉండగా బ్రహ్మదేవుడు, పరమ శివుడు అనుచరులు, దేవతలు, నారదాది మునులు వెంటరాగా దేవకీదేవి బంధింపబడి ఉన్న కారాగారం దగ్గరకు వచ్చారు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముడైన విష్ణువును ఈవిధంగా స్తోత్రం చేసారు. “మహానుభావా! నీవు సత్యమే వ్రతంగా కలవాడవు; నిత్యత్వం అనే యోగసిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారం; జరిగినది జరుగుతున్నది జరుగబోయేది అయిన కాలములలో నీవు ఉంటూ ఉంటావు; భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే అయిదు భూతాలూ నీయందే జన్మిస్తున్నాయి; అ ఐదు భూతాలలోనూ నీవే నిండి ఉన్నావు; పంచభూతాలూ ప్రళయంలో అణిగి పోయిన తర్వాత కూడా నీవు ఉంటూ ఉంటావు; సృష్టిలో ఉన్న సత్యమనేదే నీవాక్కు; అన్నిటిని సమానంగా చూడడం అనేది నీవే నిర్వహిస్తూంటావు; అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాము; మాయ అనేది నీ అధీనంలో ఉంటుంది; ఆమాయచేత జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవరించినవారు నీయందు భేదభావం వహించి ఉంటారు; కాని జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో అలోచించి ఈ సమస్తమైన రూపములు నీవే అంటారు. అంతే కాకుండా జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటుంది. 1) దానిక

శ్రీ కృష్ణావతారం 3

చిత్రం
శ్రీ కృష్ణావతారం 3  మథురకు నారదుడు వచ్చుట ఒకనాడు నారదమహర్షి కంసుడి ఇంటికి విచ్చేసాడు. కంసుడితో ఏకాంతంగా “రాజాకంస! వ్రేపల్లెలో ఉన్న నందుడూ మొదలగువారూ, వారి భార్యలూ, బంధువులూ, దేవకి మొదలైన స్తీలూ, వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతలే గాని కేవలం మానవమాతృలు కారు. నీవు రాక్షసుడవు. సర్వదేవతామయుడు అయిన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడుచేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు.” అని చెప్పి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న కంసుడు, యాదవులు దేవతలని; శ్రీహరి చేతి కత్తికి బలై చనిపోయిన కాలనేమి తానే అని; తలచాడు. ఎంతో ఆరాటం పొంది, మనసులో....  దేవకీవసుదేవుల చెరసాల ఈవిధంగా తలచుకొని మనస్సులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీవసుదేవులను పట్టి బంధించాడు. వారిపుత్రులను విష్ణుస్వరూపంగా స్మరించి వెంటనే సంహరించాడు.విజృంభించి యదు భోజ అంధక దేశాల నేలుతున్న తనతండ్రి ఉగ్రసేనుని పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుపట్టి శూరసేనదేశాలకు తానే రాజై పరిపాలించాడు. ఇలా రాజ్యాన్ని ఆక్రమించిన కంసుడు అనేకులైన రాక్షసులను అనుచరులుగా కూడకట్టుకున్నాడు. బాణుడు, భౌముడు, మాగధుడ

శ్రీ కృష్ణావతారం 2

చిత్రం
శ్రీ కృష్ణావతారం 2  వసుదేవదేవకీల ప్రయాణం శూరసేనుడి కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని పెండ్లి చేసుకుని ఒకనాడు తన భార్యతో కలిసి రథం ఎక్కి బయలుదేరాడు. ఉగ్రసేనుని కుమారుడైన కంసుడు చెల్లెలు మీద ప్రేమతో తానే స్వయంగా గుఱ్ఱాల పగ్గాలుపట్టి రథం తోలసాగాడు. అది చూసి దేవకీవసుదేవులు చాలా సంతోషించారు. రథం ముందు భేరీలూ మృదంగాలు శంఖాలు డప్పులు రాజలాంఛనాలుగా మ్రోగుతూ ఉన్నాయి. దేవకికి తండ్రి అయిన దేవకుడు కుమార్తెపై ప్రేమతో ఆమెకు అరణం ఇవ్వాలని అనుకొని. . . .సకల పరికరాలతో కూడిన పద్దెనిమిదివందల రథాలను; బంగారు గొలుసులతో అలంకరించిన నాలుగువందల ఎత్తైన ఏనుగులను; పదివేల గుఱ్ఱాలనూ; రెండువందలమంది విలాసవతులైన పరిచారికలను ఆమెకు అరణంగా ఇచ్చాడు. క్రొత్త దంపతులైన దేవకీవసుదేవులు రథంలో కూర్చుండి రాచబాటలో బయలుదేరారు. ఆ సమయంలో. . .కంసుడు గుఱ్ఱాల పగ్గాలు సడల్చి రథం వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని గుండెలు అదిరేటట్లు అశరీరవాణి ఆకాశంలో నుండి ఇలా పలికింది. “సంతుష్టురాలైన చెల్లెలు దేవకీదేవి మెప్పు కోసం ఎంతో ప్రేమతో రథం నడుపుతున్నావు. కానీ, ముందు రానున్నది తెలుసుకోలేకుండా ఉన్నావు. ఉత్తమురాలైన ఈ యువతి అష్టమగర్భంలో పుట్టినవా
చిత్రం
శ్రీ కృష్ణావతారం 1 సకల పురాణాలనూ వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూతమహర్షి, గొప్ప గుణాలచేత ఉత్తములైన శౌనకాది మహర్షులతో ఈ విధంగా అన్నాడు. "పరీక్షిన్మహారాజు శుకమహర్షిని చూసి ఇలా పలికాడు. నీవు సూర్యవంశ చంద్రవంశాల విస్తారాలను తెలియ జెప్పావు. ఆ వంశాలలో పుట్టిన రాజుల చరిత్రలు చక్కగా చెప్పావు. మేము విన్నాము. వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి. శ్రీమహా విష్ణువు మహాత్ముడూ, ఈ లోకాలకు ఈశ్వరుడూ. ఆయన శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు. అలా పుట్టి ఏవిధంగా ప్రవర్తించాడు. ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేసాడు. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది. శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసారబాధలకు ఔషధం. చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది. మోక్షం అర్థించే జనులకు కోరదగినది. అటువంటి హరిస్తోత్రం విని ఇంకచాలు అనేవాడు ఎవడూ ఉండడు. మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆమాట ఎవరూ అనరు. భీష్మాది కురువీరులతో నిండిన కౌరవసైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది. అలాంటి కౌరవసేనాసముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు. ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు. నేన