అడవి ‘దేవుళ్ల పల్లి’ శ్రీసూర్యదేవాలయం - తెలంగాణ

*తీర్థయాత్ర - పుణ్యక్షేత్ర దర్శనం
🙏🌺🌺🌺🌻💐🌻🌺🌺🌺🙏

*అడవి ‘దేవుళ్ల పల్లి’ శ్రీసూర్యదేవాలయం*

కృష్ణానది తీరంలోని అడవిదేవులపల్లి వద్ద ఉన్న చారిత్రాత్మకత, పురాణ చరిత్ర కల్గిన దేవాలయాలు భక్తులను అలరిస్తున్నాయి. ఎంతో చరిత్ర కల్గిన పురాతన దేవాలయాలు ఒకే చోట నెలవై ఉన్నాయి. అరుదైన శ్రీసూర్యదేవాలయం ఇక్కడే ఉండడం విశేషం.

నిత్యపూజలు అందుకుంటున్న ఈ దేవాలయాలకు ప్రత్యేక దినాల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.

తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక సూర్య దేవాలయంగా దీన్ని చెప్పుకుంటారు.

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్యుడికి గుడి ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో ఈ ఆలయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. సూర్య దేవాలయానికి సైతం భక్తులు ప్రత్యేకంగా హాజరవుతుండడం విశేషం. బౌద్ధ ఆలయాలకు కూడా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఇదే కృష్ణా నదీ తీరంలో కాకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లుగా.. అందుకే ఈ ప్రాంతంలో కాకులు సంచరించవనే పురాణ కథనం కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది.

*అవతలివైపు ఆధ్యాత్మిక నిలయం సత్రశాల…*

త్రేతాయుగంలో ఇక్కడ విశ్వామిత్రుడు సత్రయాగం చేసినట్లుగా చెప్పుకునే ప్రాంతం సత్రశాల. బౌద్ధంపాడు వద్ద కృష్ణా నది అవతలి ఒడ్డున ఉన్న ఈ క్షేత్రం గుంటూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కూడా శివ-చెన్నకేశవుల ఆలయాలకు తోడు వేంకటేశ్వరుడు, రాముడి ఆలయాలూ ఉన్నాయి. మన వైపున్న బౌద్ధమ ఆలయాల కంటే సత్రశాల దేవస్థానం ఇంకా పురాతనమైనదని చరిత్ర చెప్తోంది. మన వైపు అంతగా అభివృద్ధి ఛాయలు కానరాకున్నా.. సత్రశాల పలు సత్రాలతో, నిత్యం భక్తులతో విరాజిల్లుతోంది. సమైక్య పాలనలో పుష్కరాల సమయంలో అధిక నిధులు కేటాయించుకోవడమే అక్కడ అభివృద్ధికి అసలు కారణమని సమాచారం. బౌద్ధమగుళ్లలోని శివాలయానికి సాగు భూములున్నా వచ్చే ఆదాయం మాత్రం గుడిదరికి చేరడం లేదు.

*ఆలయాల అడవిదేవులపల్లి..*

కృష్ణానది పరవళ్లకు తోడు ప్రకృతి రమణీయత నడుమ అడవిదేవులపల్లి నదీ తీరంలో 50 స్తంభాలున్న అరుదైన దేవాలయాలున్నాయి. ఊరు సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో, ఊర్లోనూ అనేక దేవాలయాలు ఉండడంతో ఈ గ్రామానికి అడవిదేవులపల్లిగా పేర్కొంటారు. ఇక్కడ వైష్ణవ, శైవ మతానికి చెందిన రెండు రకాల దేవాలయాలుండడం అరుదైన విషయం.

*ఆలయాల చరిత్ర..*

క్రీ.శ 1213లో కళ్యాణ చాణక్య రాజవంశానికి చెందిన త్రిభునవ మల్లదేవుడు అతని సామంతుడైన తొండయ చోడ మహారాజు కృష్ణానది ఒడ్డున 50 స్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ మహాలక్ష్మి, విష్ణువు, శివ, ఆంజనేయుడు, సోమేశ్వరుడు, అ య్యప్ప, తదితర దేవాలయాలతో పాటుగా శ్రీచెన్నకేశవ, అరుదైన శ్రీసూర్య దేవాలయాలు ఉన్నాయి. రాజుల కాలంలో ఈ
దేవాలయాలు ఎంతో ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఆలనా పాలనా లేక అవి శిథిలావస్థకు చేరాయి. అయితే గ్రామస్తుల ఉ మ్మడి కృషి ఫలితంగా 2005లో తిరి గి అన్ని దేవాలయాలు పునరుద్ధరణ జరిగి భక్తులను అలరిస్తున్నాయి.

*పురాణ చరిత్ర..*

ఈ దేవాలయాలకు ఎంతో పురాణ చరిత్ర ఉంది. త్రేతాయుగంలో తాటకి వధ కోసం విశ్వామిత్రుడు రామ, లక్ష్మణులను తీసుకెళ్తూ ఈనదీ తీరంలోకి వస్తాడు. ఇక్కడే సూర్యాలయం ఉన్న చోట నిద్రించిన అనంతరం సంధ్యాసమయంలో శ్రీరాముడు నదిలో పుణ్యస్నానం చేసిన అనంతరం పూజ చేసేందుకు శివలింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. దీంతో పాటుగా ఇక్కడే కాకాసుర వధ జరిగిందని మరొక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అందుకనే ఇక్కడ కాకులు వాలవని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు.
🙏🌺🌺🌺🌻💐🌻🌺🌺🌺🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.