శ్రీ సుబహ్మణ్యేశ్వరాలయం, వడపళని, చెన్నై
శ్రీ సుబహ్మణ్యేశ్వరాలయం, వడపళని, చెన్నై
చెన్నై పూర్వపు పేరు మద్రాసు. ఇది తమిళనాడు రాష్ట్ర రాజధాని.
ఈ నగరములో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రఖ్యాత క్షేత్రములలో ఒకటి ఈ వడపలని. ఈ క్షేత్రం తమిళనాడు లోని చెన్నై మధ్య రైల్వే స్టేషను నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం వడపళని.
ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటాడు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్థం. అంటే ఈ వడపలనీ క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము.
కామెంట్‌లు