యమునోత్రి

🚩🌳యమునోత్రి🌲🚩
                
జీవితంలో ఒకసారైనా చార్ ధామ్ యాత్ర చేయాలని ఆధ్యాత్మిక చింతనగల ప్రతీవారు ఆశిస్తారు. భారతదేశంలోని అతి పుణ్యక్షేత్రాలైన బదరీనాధ్, కేదారనాధ్, 
గంగోత్రి, యమునోత్రి లను చార్ ధామ్ గా వర్ణిస్తారు.

హిమాలయ పర్వతాలలోని గార్వాల్
సముద్ర మట్టానికి సుమారు
11,000 అడుగుల  ఎత్తునవుండగా దానికి సమీపాన
యమునోత్రి వున్నది. 
యమునోత్రికి పైన  4,400 మీటర్ల ఎత్తున వున్న  సంబసార్ మంచు పర్వతం నుండి  తన జల పాత పయనాన్ని యమునా నది
ఆరంభిస్తుంది.
హిమాలయ పర్వత సాణువులనుండి  అనేక శాఖలుగా ఏవిధమైన 
ఉధృతం లేకుండా యమున  ప్రశాంతంగా
ప్రవహిస్తుంది.
ఇక్కడే  యమునాదేవికి
ఆలయం నిర్మించబడింది.
అశీదమహర్షి  ప్రతినిత్యం గంగలోను,  యమునలోను స్నానం చేసే నిష్ట కలవాడు.
ఆయన బాగా వృధ్ధండైపోయినందున 
గంగోత్రి కి వెళ్ళలేకపోయిన కారణంగా ఆయన కోసం గంగా నది  యమునోత్రి గా ఉద్భవించినదని భక్తులు నమ్ముతారు.
ఇంతటి విశిష్ట పుణ్య స్ధలమైన యమునోత్రి ,  ఋషీ కేష్ నుండి సుమారు  230 కి.మీ
దూరము వున్న ఉత్తర కాశీ జిల్లాలో వున్నది. డెహ్రాడూన్, 
ముసోరి, ఫార్కోట్ట్,  మార్గంలో జానకీ బాయి ఛట్టీ దాకా బస్సులో ప్రయాణించి తరువాత డోలీలు , గుఱ్ఱములు ఉపయోగించి లేదా కాలినడకన మరో  ఆరున్నర కి.మీ. దూరం చాలా ఎత్తైన , ఇరుకైన, కష్టతరమైన మార్గంలో ప్రయాణం చేసి  యమునోత్రికి
చేరాలి. 


జానకీ బాయి చట్టీ నుండి
చూసేటప్పుడు , మంచుతోకప్పబడిన హిమాలయ శిఖరాలు , ఉదయ కాంతులలో , మెరుస్తూ
కనువిందు చేస్తాయి. అక్కడి ప్రకృతి
 సౌందర్యం యాత్రికులకు పరవశం కలిగిస్తుంది.ఈ
పర్వతశ్రేణులను అధిరోహిస్తుంటే
కిందనున్న యమునా నది ప్రవాహం ఒక 
సన్నని గీతలాగ కనిపిస్తుంది.
పర్వతం ఎక్క లేని వారికి
గుఱ్ఱములు, డోలీలు  వున్నాయి.  నడిచి వెళ్ళే వారు
గుఱ్ఱాలకి, డోలీలకి మార్గం
యిస్తూ నడవాలి.  మార్గంలో అనేక చోట్ల
తేనీరు దుకాణాలు, టాయిలెట్ వసతులు వున్నాయి. 

సుందర జలపాతాలతో , బ్రహ్మాండమైన
హిమాలయ పర్వాతాల దర్శనం ఒక  ప్రక్కన , అధఃపాతాళాన సౌందర్యం నిండిన, పచ్చదనాల లోయలు మరొక ప్రక్కన
యాత్రికులకు ఆనందాన్ని , భయాన్ని ఏకకాలంలో కలిగిస్తుంది .ఈ మార్గంలో
శ్రీ రామునికి , భైరవునికి ఆలయాలు వున్నాయి.
యమునా నది జలాలు స్వఛ్చమైన లేతాకుపచ్చ వర్ణంతో వయ్యారంగా
మెలికలు తిరుగుతూ ప్రవహిస్తూంటుంది. యమునా దేవి
ఆలయం ప్రక్కనున్న మెట్లు మీదుగా క్రిందికి దిగి వెడితే యమున 
గంగా, సరస్వతి నదులవలె నెమ్మదిగా ప్రవహిస్తుంది. పైనున్న మంచు కరిగినప్పుడు మాత్రం ప్రవాహం
ఉధృతమవుతుంది.

యమునోత్రి లో చలి అధికం. నీటిని ముట్టుకుంటే చలితో
చేతులు కొయ్యబారిపోతాయి.
దీనికి సమీపముననే ఒక వేడినీటి గుండం . ప్రకృతి లోని వింతలు భగవంతుని లీలలుగా
మనలను ఆశ్చర్య పరుస్తాయి. 

అక్కడే వున్న సూర్యగుండం లో నీరు  తలమీద జల్లుకుని
ప్రక్కన వున్న యమునా బాయి గుండానికి వెడతారు. 
సూర్యగుండానికి ప్రక్కనే వున్న జల గుండం  యమునిబాయి
గుండంగా పిలువబడుతున్నది.
అక్కడ యమునాదేవి యొక్క
"దివ్య శిల"  పూజించబడుతున్నది.

అక్కడ , పండాలని పిలవబడే అర్చకులు, భక్తులు ఇచ్చే బియ్యం, బంగాళా దుంపలను
ఒక పల్చని బట్టలో కట్టి
ఆ గుండంలో 15 నిమిషాలసేపు వుంచుతారు.
అవి కొంచెం
ఉడకగానే వాటిని ప్రసాదంగా ఇస్తారు.  భక్తులు ఆ ప్రసాదం
ఇంటికి తీసుకుని వెళ్ళి
ఎండబెట్టి, పాయసం చేసుకు తాగాలని చెప్తారు.  అక్కడ
దుకాణాలలో బియ్యం బంగాళదుంపలు
అమ్ముతారు.  తరువాత
యమునాదేవి ఆలయ దర్శనం.  

యమున సూర్యుని
పుత్రిక, యమధర్మరాజు కు సహోదరి.
యమునా దేవి ని భక్తితో  పూజించినవారికి
యముని భయం లేకుండా  సునాయాస
మరణం లభిస్తుందని భక్తులు ధృఢంగా
నమ్ముతారు. 

గర్భగుడిలో నల్లని రంగు లో యమునాదేవి,  శ్వేత వర్ణంలో గంగాదేవి  దర్శనమిస్తారు.

దీపావళి పండగ  మరునాడు
యమద్వితీయ దినాన
ఉత్సవ విగ్రహాలను ,
పర్వతం కిందవున్న  ఘర్శాలి అనే  ప్రదేశంలోని ఆలయానికి
వైభవంగా పల్లకిలో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి పూజిస్తారు. 
తిరిగి ఆరు మాసముల
తరువాత అక్షయ తృతీయనాడు ఆ విగ్రహాలను యమునోత్రి
ఆలయానికి తీసుకుని
వెడతారు.

చార్ ధామ్ యాత్రలోయమునోత్రి కి
వెళ్ళడమే  కఠినమని ,  శ్రమతో కూడుకున్నదని అని యాత్రికులు
చెప్తారు. 

రచయిత :🔱శేషశ్రీ🔔

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.