శ్రీ లలితా సోమేశ్వరస్వామి దేవాలయం -సోమశిల
శ్రీ లలితా సోమేశ్వరస్వామి దేవాలయం -సోమశిల
హైదరాబాద్ నుంచి దాదాపు దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కొల్లాపూర్ (మహబూబ్నగర్ జిల్లా) పట్టణం వస్తుంది. అక్కడి నుంచి మరో 10 కిలోమీటర్లు ముందుకెళితే పవిత్ర ఆలయాలకు నెలవైన సోమశిల, ఆ ఊరిని పెనవేసుకున్న కృష్ణానది దర్శనమిస్తాయి. ఇక్కడి నుంచి నదిలో తూర్పువైపునకు శ్రీశైలం రిజర్వాయరు వరకు సాగే ప్రయాణం.. జీవితంలో ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ నదిలో నీరు పుష్కలంగా ఉండటం మూలంగా 8 నెలల పాటు జలవిహారం చేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రభుత్వ పర్యాటక సంస్థే మరబోటులో ప్రయాణం నిర్వహిస్తున్నది.
కొల్లాపూర్ పట్టణానికి 10 కి మీ దూరం లో వెలసిన ఈ క్షేత్రం లో శివలింగాలు ప్రతిష్టతమైన 15 ఆలయాలు ఉన్నాయి. లలిత సోమేశ్వర స్వామి ఆలయం ప్రఖ్యాతి గాంచినది . పుష్కరాల సమయం లో అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నది లో స్నామాచారిస్తారు . శివరాత్రి , కార్తిక మాసం లో కార్తిక పౌర్ణమి కి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు . ప్రస్తుతం ఈ దేవాలయం గ్రామానికి ఎగువ ప్రాంతం లో నిర్మించడం జరిగింది .
సోమశిలలోని శ్రీ లలితాసోమేశ్వరస్వామి దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్టు నమ్ముతున్నారు.శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కృష్ణానదిలో మునిగిపోకుండా గట్టున అదే దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసారు.ఈ గుడి 15దేవాలయాల సముదాయం.జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధమైన ద్వాదశలింగాల ప్రతిరూపాలను ఒకచోట ఈగుడిలో ప్రతిష్ఠించారు.ఈ గుళ్ళలోని అన్ని గర్భగుడుల లలాటబింబంగా గజలక్ష్మి వుండడం విశేషం.పశ్చిమచాళుక్యుల దేవాలయాలకు గజలక్ష్మి వుండడం ఆచారంగా కనపడుతుంది.అదే సంప్రదాయం కాకతీయుల దాకా కొనసాగింది.
దేవాలయంలో మూడుచోట్ల కప్పుకు ఉమామహేశ్వరుడు అష్టదిక్పాలకులచేత పరివేష్టితుడైన శిల్పం కనపడింది.అన్నింటిలోకి ఒక దేవాలయం లలాటబింబంగా నాలుగురేకులపూవు చెక్కబడివుంది.ఇది జైనుల చిహ్నం.అన్ని శైవాలయాలే.అందులో ఒకటి లలితాంబ గుడి.గుడి విమాననిర్మాణం ఫంసానపద్ధతిన కట్టబడివుంది. గుడి ముందర రెండు శాసనస్తంభాలు ఉన్నాయి.అందులో ఒకటి కళ్యాణి చాళుక్యచక్రవర్తి త్రైలోక్యమల్ల ఒకటవ సోమేశ్వరుని పాలనాకాలంలో క్రీ.శ.1055 అక్టోబరు 21న హైహయవంశీకుడు మహామండలేశ్వరుడు రేచరస మరియు నాళియబ్బె చేసిన దానశాసనం.శాసనస్తంభం బాగా శిథిలం కావడం వల్ల పూర్తి శాసనపాఠం లభించలేదు.
కామెంట్‌లు