పంచారామ క్షేత్రాలు: (కుమారభీమారామము)

పంచారామ క్షేత్రాలు: (కుమారభీమారామము) ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట పంచారామాల లో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది.  మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వది నం. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు క్షేత్ర కథనంలో వివరించబడినది. ద్రాక్షరామ దేవాలయాన్నీ ఆయనే నిర్మించాడు. కనుక ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణా నికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా వుంటుంది  నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపు రాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు.

 ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును.  ఇక్కడి అమ్మవా రు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవు ని  రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్య కాలంలో ఆలయా నికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ వూరు ఇప్పుడు భీమేశ్వరాలయా నికి ప్రసిద్ధి చెందింది. ఇది పంచారామాలలో ఒకటి. . కందుకూరి వీరేశలింగం పంతులు వ్రాసిన రాజశేఖర చరిత్రం అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర వుంది. సామర్లకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా.


.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.