ధర్మపురి క్షేత్రం - తెలంగాణ

ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది.ఈ క్షేత్రములో
శ్రీ యోగలక్ష్మీ నృసింహుని ఆలయమం,
శ్రీ ఉగ్రలక్ష్మీనృసింహుని ఆలయం తో పాటు
శ్రీ వేంకటేశ్వర స్వామి,
శ్రీ వేణు గోపాల స్వామి వార్ల ఆలయములు,
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం,
శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి
ఆలయం,
శ్రీ సంతోషిమాత ఆలయం
వంటి అనేక దేవాలయములు కలిగి దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది.

చరిత్ర
పది, పదకొండవ శతాబ్దాలలో ధర్మపురమని పేరు కలిగిని ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం
కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది.
ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ
సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.

శాతవాహనులు, బాదామి చాశుఖ్యులు కళ్యాణి
చాళుఖ్యులు, కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితి లో వున్నట్లు తెలుస్తున్నది. నైజామ్ కాలంలో కూడ
ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో వుండేది. క్రీ.శ. 1309 లో అల్లాయుద్దిన్ఖిల్జి ధర్మపురి ఆలయాల పై దాడి చేసి నాసనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తున్నది.

యోగాసీనుడైన శ్రీ లక్ష్మిసమేత నృసింహ స్వామి స్యయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసనుడై
కోర మీసాలతో ప్రసన్న వదనంతో దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడే వున్న మరో ఆలయంలో ఉగ్రరూపుడైన మరో నృసింహస్వామి వారి విగ్రహం కూడవున్నది. ఇక్కడే శ్రీ
రామచంద్రుడే స్వయంగా ప్రతిష్టించినట్టు చెప్పబడే శ్రీ
రామలింగేశ్వర ఆలయం కూడ వున్నది.

ఈ ధర్మ పురిలో అనేక ఇతర పురాతనమైన ఆలయాలు, మందిరాలు కూడ వున్నాయి. గోదావరి తీరంలో
వున్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మపురి ఆతి పురాతనమైనది ఆధ్యాత్మిక వేత్తల భావన.
అనేక ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం
వున్నది.



స్థల పురాణము
పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చితపమాచరించగా, నృసింహుడు అతనితపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను.
ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు,కుజదోష నివారణకు ప్రసిద్ధము.కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష
నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర
మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక
జీవితం సమస్యల పాలవటం కద్దు.ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే
సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ
గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని
అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.

అదనపు సమాచారం
ఆతి పురాతనమైన ధర్మపురి క్షేత్రం కరీంనగర్ కు డెబ్బై
కిలోమీటర్ల దూరంలో వున్నది. ఇది చాల పురాతనమయిన ఆలయం. దీని మూలాలు వివిద పురాణాలలో కూడ కనబడతాయి. ఇంకా అనేక శిలా శాసనాల లో కూడ దీని ప్రస్థావన ఉన్నది.
గోదావరి, భద్ర నదుల సంగమస్థలమయిన ధర్మపురి
అయిదు నరసింహాలయాలున్న ఏకైక గ్రామం. అందులో మూడు నరసింహాలయాలు నేటికీ పూజలందుకుంటున్నాయి.ఉపనిషత్తులు, పురాణాలలో
నారసింహుని రూపము, తత్వము ఎలా చెప్పబడ్డాయో అవి ధర్మపురి లో ఎలా మనకి గోచరమవుతున్నాయో
నరసయ్యగారు వివరించారు. 32 రకాల నారసింహ రూపాలు స్థలపురాణాలలో వర్ణించబడినాయట. ధర్మపురి
గర్భాలయంలో ఉన్నది ప్రహ్లాదయుతుడైన నారసింహుడు. అలాగే నవవిధమైన నారసింహ
తత్వాలున్నాయి. ధర్మపురిలో యోగనారసింహుడు,
ఉగ్రనారసింహుడు,ప్రహ్లాదనారసింహుడు,లక్ష్మీనారసింహుడు అనే తత్వాలుప్రకాశించాయి.ఇక్కడి ప్రధాన దేవాలయమైన శ్రీ యోగలక్ష్మీ నృసింహుణ్ని ఆలయమమునందు ఎక్కడా కనబడని

బ్రహ్మ దేవుని విగ్రహము, యముని విగ్రహముండుట మిక్కిలి విశేషము.ఇక్కడికివచ్చిన యాత్రికులకు యముని
దర్శనము వలన నరక బాధ ఉండదనిక్షేత్రపురాణము తెలుపుతున్నది.ముఖ్యముగా ఇక్కడ పుణ్య
గోదావరి నది సమీపములో నుండుటచేత యాత్రికులకు సకల పాపనివారణ కావడమేకాక ఎంతో ఆహ్లాదకరమైన పిక్ నిక్ సెంటర్ వలే గోదావరి ఒడ్డున సమయము
గడుపుతారు. ఈ ప్రాంత గోదావరి ప్రమాదకరమైనది కాక స్వచ్చమైన నీటిప్రవాహము గలది.
ధర్మపురిలోని రామేశ్వరాలయం భువనేశ్వర్ లోని లింగరాజస్వామి దేవాలయాన్ని పోలి వున్నదన్న
విషయం, హంపిలోని షద్భుజ నారసింహ విగ్రహానికి మాతృక ధర్మపురిలోని మసీదు నారసింహాలయంలోని విగ్రహమేనన్న విషయం, ఇంకా ధర్మపురిలోని ఆలయ
నిర్మాణాలకి, హంపిలోని నిర్మాణాలకు మధ్యన పోలికలు వున్నాయి.

నృసింహ జయంతి;ధర్మపురి సంసార సాగర నిమజ్జన

ముహ్యమానం దీనం విలోకయ విభీకరుణానిధేమామ్|
ప్రహ్లాద భేద పరిహార పరవతార లక్ష్నీనృసింహ మమదేహి
కరావలంబమ్||
సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ
శతసర్పసమాకులస్య|
దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్షీనృసింహ
మమదేహి కరావలంబమ్||
అవి తొలుత
ఆలా! శ్రీ నృసింహస్వామి వారిని ప్రార్థించి ఆ స్వామి వారి
ఆవిర్భావమునకు గల కారణాలు ఏమిటో? ఒక్కసారి
మననంచేసుకుందాం! ఈ భూమిపై 'మానవుడు ' అవతరించిన నాటినుండి తనమనుగడకు
ఆనందం కలిగించేవాటిని, తనలు
అమ్మి వ్ధాలమేలును చేకూర్చే ప్రకృతి సంప్స్దకు "దేవతా
స్వరూఅపాలు కల్పించి"వాటిని పూజిస్తూ ఉండటం మనంచూస్తూ ఉంటాము. అలా మానవుడు
ఈ సృష్టిలోని చరాచరములను అన్నింటిని పూజ్త్యభావముతో చూడటం ఒక విశేషం!అంతేకాదు
మన భారతీయ సంస్కృతిలో చెట్టు,పుట్ట, రాయి, రప్ప, కొండ, కొన,నది,పర్వతాలు ఇలా ప్రకృతిలోని
సంపదనూన్నిటిని పదిలపరుచుకునేందుకు తగు
చర్యలు తీసుకుంటూ ఉండటం మరోవిశేషం.అందువల్లనే
మన భారతదేశము కర్మభూమిగా పేరుగాంచినది. అట్టి భారతీయుల ప్రబలమైన విశ్వాసము నకు ప్రామాణికమైనది ఈ నరసింహస్వామి ఆవిర్భావచరిత్ర.. పూర్వం వైకుంఠపురిని ద్వారపాలకులైన 'జయ
విజయులూ సంరక్షించు ఉండు సమయాన,ఒక్కసారి
సనక,సనందన,సనత్కుమార సనత్సజాతులైన
బ్రహ్మమానసపుత్రులు వైకుంఠవాసుని దర్శనార్థమై
వస్తారు.వారు వచ్చినది శ్రీమహావిష్ణువు ఏకాంత సమయం అగుటవల్ల,శ్రీహరి దర్శనానికి వారిని
అనుమతించక అడ్డగిస్తారు.దానితో ఆగ్రహించిన ఆ తపోధనులు వారి ఇరువురును శ్రీ మహా విష్ణువునకు విరోధులై మూడు జన్మలపాటు రాక్షసులుగా
జన్మించండి అని శపిస్తారు.అలా శాపగ్రస్తులైన వారు ఇరువురు మొదటి జన్మలో హిరణ్యాక్ష,
హిరణ్యాకశిపులుగా రెండవ జన్మలో రావణ,కుంభకఋణులుగా మూదవ జన్మలో శిశుపాల,దంతవక్త్రులుగా జన్మిస్తారు.అలా మొదటి జన్మలో దితి,కశ్యపు దంపతులకు హిరణ్యాక్ష,
హిరణ్యకశిపులుగా జన్మింస్చిఘోరమైన తపస్సులుచేసి,ఆ
వరగర్వంతో లోకకంటకులైనారు.దానితో
దుష్టశిక్షా, శిష్టరక్షణార్థం ఆ అసురుల వరాలకు అనుగుణమైన ఎన్నో అవతారాలు ఎత్తుతూ వాటిలో
వరాహావార రూపంలో హిరణ్యాక్షుని ఆటలు కట్టించి హిరణ్యాక్షుని సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు. తన సోదర సంహారముపై మిక్కిలి ఆగ్రహించిన 'హిరణ్యకశిపుడు '
బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సుచేసి దానవ పరిజ్ఞానముతో వివిధ రీతుల మరణము లేకుండ
వరాలుపొంది.తనకు ఒక ఏవిధముగాను మరణమే లేదు అను వరగర్వముతో ఎన్నో అకృత్యాలు చేస్తూ విర్రవీగిపోతూ ఉంటాడు.అట్టి దానవ శ్రేష్ఠునకు నలుగురి
కుమారులలో పెద్దకుమారుడైన "ప్రహ్లాదుడు"విష్ణుభక్తుడై
తండ్రి అగ్రహానికి గురైనా, హరి నామస్మరణ వీడదు. దానితో వానిని గురుకులాల్లో వేసి బుద్ధిని మార్చుటకు ప్రయత్నిస్తాడు. అక్కడ గురుకులాల్లో కూడా తోటి బాలురకు "హరినామ మాధుర్యాన్ని"
పంచిపెడుతూ వారిచే కూడా హరికీర్తనలు పాడించేవాడు.చివరకు హరినామస్మరణ వీడమని సామ, దాన, భేద,దండోపాయాలతో ప్రయత్నిస్తారు.అందువల్ల కూడా ఏ ప్రయోజనము పొందలేకపోతాడు.చివరకు
పుత్రవాత్సల్యమనేది లేకుండ "ప్రహ్లాదుని" సంహరించుటకు వివిధ మార్గాలు
అవలంబిస్తాడు.ప్రహ్లాదుని ఆగ్రహించిన హిరణ్యకశిపుడు
ప్రహ్లాదునితో నిన్ను అనుక్షణమూ కాపాడుచున్న శ్రీహరి ఏక్కడరా?ఈ స్తంభమునందు చూపగలవా?అని
ప్రశ్నిస్తాడు.అందుకు ప్రహ్లదుదు తండ్రీ!
సర్వాంతర్యామి అయినా శ్రీహరి
"ఇందుగలడందులేడను
సందేహములేదు"ఎందెందు
వెదకిన అందందే కలడు అని జవాబు
ఇస్తాడు.అయితే ఈ స్తంభమునందు చూపగలవా?అని
ఆగ్రహంతో తనచేతిలో ఉన్న గదతో ఒక్క ఉదుటన స్థంబాన్ని గట్టిగా కొడతాడు. అనంత శ్రీహరి 'హిరణ్యకసిపుడు 'తన దానవ పరిజ్ఞానుతో 'బ్రహ్మా వలన
పొందిన వరాలు ఎమిటో?వాటిలోని లోపాలు
క్షణకాలం అలోచించి, అంటే గాలి,నీరు, అగ్ని, భూమి,
ఆకాశమునందుగాని,దిక్కులలోగాని,రాత్రిగాని , పగలుగాని, చీకటిగాని,వెలుతురుగాని, నీటిజంతువులు,
క్రూరమైన అడవిజంతువులవల్లగాని,
సర్పాలవల్లగాని, దేవతలవల్లగాని,మనుషులవల్లగాని,అస్త్రశస్త్రాలవల్
లగాని,ఇంటగాని,బయతగాని,చావులేకుండా పొందిన వరాలకుఅనుగుణమైన రూపుదాల్చిహరిణ్యకశివుడు మొదిన స్తంభమునుండి తన అవతారాలలో
'నాలుగవ అవతారం'"శాశ్వత అవతారం"అంటే!నిర్యాణము పొందిన రాముడు.కృష్ణుడువంటి
అవతారముల వలెకాకుండా!సద్యోజాతుడై అంటే అప్పటి
కప్పుడు అవతరించినవాడు మిగిలిన అవతారములలోవలే తల్లి దండ్రులతో నిమిత్తములేకుండా! స్వచ్చందంగా ఆవిర్భవించిన అవతారమే ఈ"నృసింహ అవతారము"
శాశ్వతమైనదిగా చెప్పబడినది. అలా ఈ శ్రీ నృసింహస్వామివారు వైశాఖ శుక్లపక్షములో పూర్ణిమకు
ముందువచ్చే 'చతుర్దశి 'నాడు ఆఆవిర్భవించారు.ఆపుణ్యదినమునే మనం "శ్రీనృసింహ జయంతి"గా జరుపుకుంటూ ఉంటాము.ఇది
క్తయుగంలో వచ్చిన పరిశుద్ధావతారం. "వైశాఖ శుక్ల
పక్షేతు చతుర్థశ్యాం సమాచరేత్ ,మజ్జన్మ సంభవం వ్రతం
పాపప్రణాశనం"అని సాక్షాత్తు శ్రీహరి స్వ్యంగా ప్రహ్లాదునితో చెప్పినట్లు"నృసింహపురాణం"లో చెప్పబడినది.
ఆవిధంగా ప్రహ్లాదుని విశ్వాసమైన (సర్వాంతర్యయామి)అనిపలుకులకు ప్రామాణికంగా హిరణ్యకశిపుడు మోదిన స్తంభము ఫెళఫెళమని
విరగిపడుచుండగా భూనభోంతరాలన్ని
దద్దరిల్లేలా సింహగర్జనతో ప్రళగర్జన చేస్తూ! ఉగ్రనరసింహ
రూపంతో ఆవిర్భవిస్తాడు.అట్టి స్వామి ఆకారంచూస్తే
సింహంతల,మానవశరీరం.సగంమృగత్వం,సగం నరత్వం.ఇంకా ఆమూర్తిలో క్రౌర్యం,కరుణ,ఉగ్రత్వం,ప్రసన్నత ఆవిధంగా పరస్పర విరుద్ధమైన గుణాలతో కూడియున్న అవతారమూర్తిలా ఉన్నారు ఆ నృసింహస్వామి. అలా ఆవిర్భవించిన
ఆ స్వామి "హిరణ్యకశివుదు"పొందిన
వరాలను చేదించకలిగే రూపాన్ని మరియు అట్టి వాతావరణాన్ని అంటే అటురాత్రి ఇటుపగలు కాని సంధ్యా సమయాల్లో, ఇటు భూమి అటు ఆకాశముకాని ప్రదేశము"గడపపైన"మృగ నరలక్షణాలతో
గూడి,ఒక్క ఉదుటన హిరణ్యజశిపుని
మెడపట్టి తన తొడలపై పరుండబెట్టి
జీవము నిర్జీవముకాని గోళ్ళతో హిరణ్యకశిపుని ఉదరమును చీల్చిచండాడి సంహరించినాడు.
అనంతరము ఆ ఉగ్రనరసింహమూర్తిని దేవతలు
ఎవ్వరు శాంతింప చేయలేక ,దేవతలందరు ప్రహ్లాదుని
ఆ స్వామిని శాంతింప చేయమని కోరతారు. అలా ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతించిన ఆ స్వామి శ్రీ మహాలక్ష్మీ
సమేతుడై భక్తులకు ప్రత్యక్షమౌతాడు.అట్టి స్వామి
నిర్యాణములేని అవతారమూర్తిగా,పిలిస్తే పలికేదైవంలా
భక్తుల పాలిట కల్పతరువుగా కొనియాబడచూ
పూజించబడుచున్నారు.

కోటిలింగాల
ధర్మపురికి 15 కి.మీ దూరంలో వున్న కోటిలింగాలలో బయటపడిన శిలాఫలకాలు, శాతవాహనుల కాలం నాటి
అంతకన్నా ముందరి రాజుల నాటి (సామగోపుని గోభద్రుడు) నాణేలు,అలాగే 2003లో పుష్కరాల సమయంలో భూమిని చదును చేస్తున్నపుడు
బయటపడిన యజ్ఞవాటికలు, వాటిలో వాడిన ఇటుక, మొదలైనవి బయట పడ్డాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.