దంతేశ్వరి దేవాలయం చత్తీస్ గఢ్ రాష్ట్రం

💐💐💐💐దంతేశ్వరి దేవాలయం💐💐💐💐

దంతేశ్వరి దేవాలయం దంతేశ్వరి దేవత కొలువున్న దేవాలయం. ఇది భారతదేశంలోని 52 శక్తి పీఠాలలో ఒకతిగా ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్య రాజులచే నిర్మించబడింది. ఇది చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ తెహసీల్ నుండి 80 కి.మీ దూరంలో గల దంతెవాడ వద్ద ఉంది. కాకతీయుల కాలంలో దంతేశ్వరి దేవి నెలకొని యున్న ఈ ప్రాంతం కనుక ఈ గ్రామానికి దంతెవాడ అని పేరు వచ్చింది. సాంప్రదాయకంగా ఈ దేవత బస్తర్ జిల్లా వాసులకు కులదైవం.


చారిత్రక ఇతిహాసాల ప్రకారం సత్య యుగంలో దక్షుని యజ్ఞం వద్ద సతీదేవి తన భర్తకు అవమానం జరిగినదని యజ్ఞ గుండం లోనికి ప్రవేశిస్తుంది. దానికి శివుడు సతీదేవి దేహంతో శివతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక అచట శక్తి పీఠఖ్ కొలువైనట్లు కథనం.

ప్రతీ సంవత్సరం దసరా సందర్భంగా వేలాది గిరిజనులు వివిధ గ్రామాలు, అడవుల నుండి ఇచ్చటికి చేరి ఈ దేవతా విగ్రహాన్ని బయటకు తీసి పట్టణం చుట్టూ ఊరేగిస్తారు. ప్రస్తుతం "బస్తర్ దసరా" పండగ అనేది ప్రాముఖ్యత గల పర్యాటకుల ఆకర్షణగా నిలిచింది. నవరాత్రి సందర్భంగా జ్యోతికలశాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం.
     
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.