నిత్య పితృ స్తోత్రం
*బృహ ద్ధర్మ పురాణం లో బ్రహ్మదేవుడు చేసిన పితృ స్తుతి*
ఈ స్తోత్రాన్ని శ్రాద్ద దినములదే కాక ప్రతిరోజూ ఎవరు పారాయణం చేస్తారో వారికి ఈతి బాధలు ఉండవు. ఎవరైనా వారి పితారుల విషయంలో తప్పుచేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రమును పారాయణం చేయుట వలన ప్రాయశ్చిత్తం జరిగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా వారి పుట్టినరోజు నాడు మరియు అమావాస్య ,మహాలయ పక్షమునందు పితృ దేవతల ప్రీత్యర్థం పారాయణం చేస్తే పితృ దోష నివారణ జరిగి వారి అనుగ్రహముతో కుటుంబంలో అనేక శుభములు వంశ వృద్ధి కలిగించును. పితృ దేవతల అనుగ్రహమునకై శ్రద్ధగా పారాయణం చేయండి.
పితృ స్తోత్రము
బ్రహ్మ ఉవాచ :
1. శ్లో || నమో పిత్రే జన్మ దాత్రే సర్వదేవ మయాయ చ | సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ||
2. శ్లో || సర్వేయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే | సర్వతీర్థావలోకాయ కరుణా సాగారాయ చ ||
3. శ్లో || నమో సదా ఆశు తోషాయ శివరుపాయతే నమః | సదాపరాధ క్షమినే సుఖాయ సుఖదాయ చ ||
4. శ్లో || దుర్లభం మానుషమిదం యేనలబ్దం మాయా వపు: | సంభావనీయం ధర్మార్ధే తస్మై పిత్రే నమో నమః ||
5. శ్లో || తీర్థ స్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం | మహా గురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః ||
6. శ్లో || యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృ తర్పణం | అశ్వమేధ శతై తుల్యం తస్మై పిత్రే నమో నమః ||
ఫలశృతి:
ఇదం స్తోత్రం పితృ: పుణ్యం యః పఠేత్ ప్రయాతో నరః
ప్రత్యహం ప్రాతారుత్థాయ పితృ శ్రాద్ధ దినోపి చ
స్వజన్మ దివసే సాక్షాత్ పితురగ్రే స్థితో పివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞాత్వాది వాంఛితం
నానాపకర్మ కృత్వాపి యః స్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్
పితృ ప్రితీకరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి
నిత్య పితృ స్తోత్రం సంపూర్ణం
కామెంట్‌లు