మానవ శరీరం నందలి నాడుల గురించి సంపూర్ణ వివరణ -
మానవ శరీరం నందలి నాడుల గురించి సంపూర్ణ వివరణ -
శరీరంనందలి మూలాధారమునకు మీదుగా నాభిస్థానంనకు మధ్యంబున కందస్థానము నందు సుషమ్న అను ఒక నాడి ఉంటుంది. ఈ నాడిని చుట్టుకుని ఇళ , పింగళ అను రెండు నాడులు ఈ సుషమ్న నాడిని చుట్టుకుని ఉంటాయి. మానవ శరీరం మొత్తం మీద మూడు కోట్ల యాభై లక్షల నాడులు ఉన్నాయి. ఆ నాడులు మూలాధారమును ఆశ్రయించి కొన్ని పై భాగమునకు , మరికొన్ని కింద భాగమునకు వ్యాపించి ఉన్నాయి . మరలా పై భాగమునకు వ్యాపించి ఉన్న నాడులను ఆశ్రయించి మూడు కోట్ల యాభై లక్షల రోమములు ఉన్నాయి . ఈ రోమములు నాడుల యొక్క ముఖఃభాగముగా ఉండును. ఆ రోమ రంధ్రముల నుంచి చెమట శరీరం నుంచి బయటకి వస్తుంది.
మనుష్య దేహము నందు పైన చెప్పిన నాడులకు ఆధారభూతమై పరబ్రహ్మ స్వరూపం అగు ఒక వాయవు ఉంటుంది. అది ప్రాణాదివాయువుల ద్వారా దేహమంతయు వ్యాపిస్తూ ఉంటుంది. మూలాధారం నుండి పాదము మొదలు శిరస్సు వరకు ఏడువందల నాడులచేత మనుష్యదేహము మందపాటి చర్మముచే ఒక కట్ట వలే బంధించబడి ఉండును. ఈ నాడులలో ఇళ , పింగళ , సుషమ్న , సరస్వతి , వారుణి , పూష , హస్తిజిహ్వ , యశశ్వని , విశ్వోదరి, కుహు, శంఖిని , పయస్విని , అలంబుస , గాంధారి అను పద్నాలుగు నాడులు అతిముఖ్యమైనవి. ఈ పద్నాలుగు నాడులు మనుష్య ప్రాణాలకు అతిముఖ్యమైనవి .
ఇళ , పింగళ , సుషమ్న అను మూడు నాడులు శరీరం నందు పైభాగానికి పోవును . గాంధారి , హస్తజిహ్వా అను రెండు నాడులు చేతులు మొదలగునవి చాచుటకు , ముడుచుటకు ఉపయోగపడును. అలంబుస , యశశ్వని అను రెండు నాడులు శరీర దక్షిణభాగమున ఉండును. కుహు , శంఖిని అను నాడులు శరీరం వామభాగము నందు వ్యాపించి ఉండును. మధ్యభాగంలో ఉండు పూష అను నాడి సమస్త కార్యాలు చేస్తుంది .
శరీరం వామ నాశిక యందు ఇళ , దక్షిణ నాసిక యందు పింగళ , బ్రహ్మరంధ్రము నందు సుషమ్న నాడి , వామనేత్రంబున గాంధారి నాడి , దక్షిణ నేత్రము నందు హస్తిజిహ్వ నాడి , దక్షిణ భాగమున చెవి యందు పూష నాడి , వామ భాగము నందు యశశ్వని , నాలిక యందు అలంబుస , శిశ్న మూలము నందు కుహువు , తల పైభాగం నందు శంఖిని ఇలా పది నాడులు శరీర ద్వారంబులను ఆశ్రయించి ఉండును.
ప్రాణం , అపానం , సమానం , ఉదానం , వ్యానం , నాగము , కూర్మం , కృకరము , దేవదత్తము , ధనుంజయము అను ఈ పదివాయవులు శరీరం నందలి సర్వనాడుల యందు సంచరించుచుండును. ఈ పదివాయువులలో ఐదు, ప్రాణాలకు ముఖ్యమైన వాయువులు . చెవుల యందు ఉండు నాడులు శబ్దగ్రాహకాలుగా , కళ్ల యందు ఉండునవి రూపగ్రాహకాలుగా , నాశికా యందు ఉండునవి వాసన గ్రహించే విధముగా , నాలిక యందు ఉండునవి రుచిని , చర్మము నందు ఉండునవి స్పర్శగ్రాహకముగా , హృదయము నందు ఉండునవి , ముఖం నందు ఉండునవి శబ్దోచ్చారణమునకు ఉపయుక్తముగా ఉండును.
ముప్పైరెండు మూరల కలిగిన విశ్వోదరి అను నాడి ఉదరము నందు ఉన్నది. దానిలో మూర భాగం కంఠస్థానం నందు ఆశ్రయించి ఉండును.
మరికొన్ని విషయాలు తరవాతి పోస్టులలో తెలియచేస్తాను.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల - 350 రూపాయలు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల - 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్
9885030034
మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034
కామెంట్‌లు