శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, బొప్పూడి, గుంటూరుజిల్లా.

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, బొప్పూడి, గుంటూరుజిల్లా.

గుంటూరుజిల్లా-చిలకలూరిపేట మండలంలో 5వ నెంబరు జాతీయ రహదారిపై బొప్పూడి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. జాతీయ రహదారిలో గతంలో తీవ్రంగా రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఆ ప్రమాదాలను అరికట్టడానికి ఆధ్యాత్మిక గురువైన తక్కెళ్ళపాడు అయ్యవారు ఆంజనేయస్వామి వారి ఆలయం నిర్మిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. దాంతో బొప్పూడి గ్రామప్రజల సహకారంతో ఆలయం 1984వ సంవత్సరంలో నిర్మించటం జరిగింది.

ముఖమంటపంపై, ప్రధానాలయ గోపురంపై పలురీతులలోని ఆంజనేయస్వామి విగ్రహాలు ఉన్నాయి. గర్భాలయంలో ఆంజనేయస్వామి తిరునామంతో భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ ఆంజనేయస్వామి వారికి ఎడమ వైపున శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలు కొలువై ఉన్నాయి.

వాహన పూజలకు, మాలదీక్షాదారులకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిధ్ధిచెందింది. ఈ ప్రాంత ప్రజలు ఏ క్రొత్త వాహనం కొనుగోలు చేసినా ఈ ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తారు.ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి మూర్తి ఉంది ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో భక్తులు మాలధారణ స్వీకరిస్తున్నారు.ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు, పండుగ పర్వదినాలలో విశేషార్చనలు, ప్రత్యేక పూజలు, హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా, వైభవంగా నిర్వహిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.