చమకం ప్రాముఖ్యత ఏమిటి?
చమకం ప్రాముఖ్యత ఏమిటి?
నమక-చమకాలు శివునికి అత్యంత ప్రీతికరమైనవి ..అయితే వాస్తవానికి ఈ రెంటి ప్రాముఖ్యత-ప్రాధాన్యత తెలిసినవారు బహు అరుదు అని చెప్పవచ్చును..అసలు ఈ రెంటి మీదా వొక బృహత్ గ్రంధమే రాయవచ్చును.సమస్త మంత్ర శాస్త్రం ఈ రెంటిలో నిక్షప్త బరచబడిఉంది.సాధారణ పరిభాషలో నమకం అంటే నడక-చమకం అంటే చలనము అనే అర్దాలున్నా..అవి ఈ రెంటికి చాలా పాక్షికంగా మాత్రమే వర్తిస్తాయి.నడక జీవి అయితే ఆ నడక మృత్యువుతో పరిసమాప్తి అవుతుంది.ఈ పరిసమాప్తిలో మది మధ్య విశ్రాంతి ఉంటుంది కానీ చమకం అనేది నిరంతర్ సృష్టి ,అది ఆగదు..
ఇక మంత్ర శాస్త్రానికి వస్తే చకారం షట్ శత్రు సంహారిని అయిన బీజం ..న కారం అంటే జీవులు నస్వరాలు అయిన ధూమా నికి ప్రత్రూపాలు.అందుకే న- కారమును ధూమ బీజం అంటారు.. ధూమం శాశ్వతం కాదు కానీ నిరంతరత్వం శాశ్వతమైనది..ఈ నిరంతరత్వం కొన్ని కోట్ల వత్సరాలు సాగుతూనే ఉంటుంది..ఇక సాధారణ నిఘంటు అర్ధంలో న-చ కారములు ఆకాశ--వాయు బీజాలు .ఇవే రెండూ శబ్దానికి అయువులాంటివి..అందుకే చూడండి నమకం-చమకం వింటుంటే మన మెదడు అదో ట్రాన్స్ లోకి వెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంటుంది..అంటే మన బ్రెయిన్ ఆ వాయు-శబ్దాలకి ట్యూన్ అయిపోతుంటుంది..నమకం మనిషి నడక అయితే చమకం ఈశ్వరుని నిరంతర చలనం..
కామెంట్లు