శ్రీ సూర్య దేవాలయం.. మోధేరా, గుజరాత్

శ్రీ సూర్య దేవాలయం.. మోధేరా, గుజరాత్

ఓంశ్రీఆదిత్యాయ నమః 

గుజరాత్ రాష్ట్రం లో,  అహ్మదాబాద్ కు వంద కి మీ దూరంలో మొధేరా సూర్య దేవాలయం ఉంది..

 ఇది అత్యంత   పురాతనమైన  మహా  శక్తివంతమైన   సూర్యదేవాలయము.   పూర్వం  ఎప్పుడో  ఆనాటి  రాజులు  ఆధ్యాత్మిక  వారసులు  దైవారాధనపరులు  ఎంతో  పటిష్టమైన   శక్తివంతమైన  రాతితో  శిల్పాకృతులుగా  మలచి  కట్టదిట్టమైన   పునాదితో  చక్కగా  కట్టించిన  ఈ  దేవాలయం  బహు సుందరం.

దాదాపు పదకొండో శతాబ్దంలో  - సోలంకి వంశపు రాజులు  భీమదేవుడు  కాలంలో కట్టించిన సూర్య దేవాలయం  ఈ  మొధేరా లో వుంది .


*పుష్మావతి నదీ తీరంలో  ఈ సూర్య దేవాలయం కట్టించిన రాజులు   నాటి టెక్నాలజీ  ఇప్పటి తరాలకు ఆదర్శమే కదా ., 

* ఇక్కడి ఆరకియాలజికల్ మ్యూజియం  / పాత విగ్రహాలు  - వీటన్నిటికీ తోడు  ఓ గొప్ప అందమైన తోట  - ఈ సూర్య దేవాలయం కే  అందం .

 ఇక్కడకు దాదాపు ముఫ్ఫై కిలోమీటర్ల దూరంలో వున్న  "పాటన్" లోని  ఒక బావి  - ఓ కళాఖండమని చెప్పాలి ., దేవాలయం గోపురాలు తిరగదిప్పి చూస్తే ఎలా వుంటుందో - అలాగే వున్న నిర్మాణం ఈ బావి .

* ఇక్కడ కూడా ఓ అందమైన తోట వుంది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.