బోధిధర్ముడు ఓ గొప్ప సాధువు.

బోధిధర్ముడు ఓ గొప్ప సాధువు. 


ఆయన వద్దకు ఓరోజు ఒక రాజు దిగాలు మొహంతో వచ్చాడు.

బోధిధర్ముడి దగ్గర ఏమీ లేదు. అయినా ప్రశాంత మనస్కుడవడంతో కళ్ళల్లో ఓ తేజస్సు. పెదవులపై ఎప్పుడూ చెరగని నవ్వు. 

మరోవైపు బోలెడంత ఐశ్వర్యం. బోలెడంతమంది నౌకర్లు. ఆయన ఆజ్ఞాపించక్కర్లేదు. పిలిస్తే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని ఏ పని చెప్తే ఆ పని చెయ్యడానికి నౌకర్లున్నారు. కానీ ఆయన ఎప్పుడూ దిగులుతోనే ఉండేవాడు.

బోధిధర్ముడికి నమస్కరించి తాను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని అంటాడు. 

అతను చెప్పినదంతా విన్న బోధిధర్ముడిలో ఒకింత చిలిపితనమూ లేకపోలేదు.

"సరేగానీ, ఈరోజు వెళ్ళి రేపు రా. నీలో గూడు కట్టుకున్న సమస్యలను తరిమేస్తాను" అంటాడు.

రాజు సరేనని చెప్పి మరుసటి రోజు బోధిధర్ముడి దగ్గరకు వస్తాడు. అప్పటికే బోధిధర్ముడు ఓ కర్రతో సిద్ధంగా ఉంటాడు. 

రాజు ఆయన దగ్గరున్న కర్రను చూసి "ఏంటీ ...ఈయన కర్రతో ఎదురుచూస్తున్నాడు. కొంపదీసి కొడతాడా?" అని పరిపరివిధాల ఆలోచిస్తాడు.

బోధిధర్ముడు "వచ్చేవా. కూర్చో. నీకోసమే చూస్తున్నాను. కళ్ళు మూసుకో. నీలో నుంచి ఒక్కొక్క సమస్యనూ బయటకు పంపు. వాటిని ఈ కర్రతో తన్ని తరుముతాను" అంటారు.

రాజు కళ్ళు మూసుకుని తనలోకి చూసుకుంటాడు. తనలో ఉన్న సమస్యలను ఆలోచిస్తాడు. నూటికి నూరు శాతమూ తనలోని సమస్యలకు తానే కారణం. మరెవరో కాదు అని ఆలోచిస్తుండగా వాస్తవ  విషయం బోధపడుతుంది. దాంతో వాటిని ఒక్కొక్కటిగా బయటకు చెప్పుకుంటున్న కొద్దీ మనసు తేలికపడటం మొదలవుతుంది. 

ఓ దశలో బోధిధర్ముడి పాదాలపై పడి సమస్యలకు పరిష్కారం తెలిసింది అని చెప్తాడు రాజు. 

వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారనడంతోనే మనకు మనం సమస్యగా మారుతుంటాం. ఎక్కువ సమస్యలింతే. అందుకే అద్దంలా ఉండాలంటారు. అది మనం చూస్తేనే మనల్ని ఉన్నది ఉన్నట్టు

చూపుతుంది. అలాగే సమస్యలూనూ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.