గోవు విశిష్టత

గోవు ఉండటమే గొప్ప పర్యావరణ పరిరక్షణ

ఆవుపేడ పిడకలు కాల్చటంవలన వచ్చే పొగ, ఆవుపేడతో అలికిన గోడలు అణుశక్తివల్ల వచ్చే రేడియేషన్ నుండి కాపాడగలవని, ఆవునెయ్యితో చేసే హోమంవలన వచ్చేపొగ వాతావరణంలోని అనారోగ్య క్రిములను, ఎలర్జీని పోగొడుతుందని, గోవు ఉండటమే గొప్ప పర్యావరణ పరిరక్షణ అని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు పర్యావరణ పరిరక్షణ లో గోవు (ఆవు) పాత్ర పర్యావరణం అనేది తరతరాలుగా అందివస్తున్న వారసత్వ సంపద. దానిని కాపాడి భావి తరాలకు అందివ్వాలి. అది మన భాద్యత. ఉమ్మడి కుటుంబాల వలన పర్యావరణ పరిరక్షింప బడుతుంది. చిన్నకుటుంబాల వలన కాలుష్యం పరిరక్షింప బడుతుంది ఇంటి ముందు ఆవును పిలిపించుకుని,పాలు పిండించుకునేవారు ఆరోగ్యం అనే ఆస్తిని సంపాయించే వారు పర్యావరణ ప్రేమికులు
ఇవాళ గోమూత్రం అంతర్జాతీయ మార్కెట్‌లో 800-1200 రూపాయల వరకు పలుకుతున్నది. అదేవిధంగా ఆవు పేడ నుంచి మీథేన్‌ గ్యాసును ఉత్పత్తి చేస్తే 70 పైసలకే కిలోమీటర్‌ వాయుకాలుష్యం లేకుండా వాహనాలపై ప్రయాణం చేయవచ్చు. అలాగే శబ్దం రాని వాహనాలతో ధ్వని కాలుష్యం లేకుండా నివారించవచ్చు. వంట చెరుకుగా కట్టెలకు బదులుగా ఇళ్లల్లో, ఫ్యాక్టరీల్లో ఆవుపేడను ఉపయోగించి అడవులను కాపాడవచ్చు తద్వారా పర్యావరణ పరిరక్షణ చేయవచ్చు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత.. ప్రజలంతా సంతోషంగా జరుపుకునే వినాయక చవితి వేడుకల్లో పర్యావరణానికి హాని కలుగకుండా పూజలు చేయాల్సిన అవసరముంది. వివిధ రంగుల్లో అందంగా కనిపిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలతో ప్రజలందరికి హాని కలుగుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యారవణాన్ని రక్షించుకోవడానికి ముందుకొచ్చి గోమయ వినాయక విగ్రహాలను పూజిస్తే బాగుంటుంది.త్వరలోనే అందరు గోమయ వినాయక విగ్రహాలను పూజిస్తారని నమ్మకం ఉంది తద్వార పర్యావరణ పరిరక్షణ చేయగలము సామాన్యులుగా మనమేం చేస్తున్నాం, పర్యావరణాన్ని పరిరక్షించడంలో మన వాటా ఎంత? - అన్న ప్రశ్నకు జవాబు... ఓ చిన్న సంకల్పం చాలు. అదే విత్తయి, మొలకై, మొక్కై, చెట్టై, మహావృక్షం అవుతుంది. జగమంతా సుభిక్షం అవుతుంది. గోవును రక్షించుకొందాం పర్యావరణాన్నికాపాడుకోందాం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.