శ్రీరామనవమి
శ్రీరామనవమి..
శ్రీ రాముడు మను వంశం లో అరవై ఐదవ రాజు.
ఉత్తర ప్రదేశ్ లో చైత్ర శుద్ధ
నవమి నాటి రాత్రి రాముడవతరించిన రోజుగా,ఉత్సవాలు జరుపుతారు.
అయోధ్యను దర్శిస్తే శ్రీ రాముడు పుట్టి పెరిగిన
భవంతి ని దర్శించవచ్చును.
ఇక్కడి కనక భవనం చూడతగిన భవనం.
ఇక్కడ శ్రీ రాముడు
సీతాదేవి బంగారు సింహాసనం మీద ఆశీనులై దర్శనమిస్తారు.
ఈ కనక భవనం ఒకప్పుడు కైకేయి భవనం.
ఆ భవనాన్ని సీతాదేవి కి
బహుమతిగా యిచ్చింది
కైకేయి.
శ్రీ రాముడు నాసిక్ పంచవటి క్షేత్రం లో పన్నెండు సంవత్సరాలు
పైనే నివసించాడు.
నాసిక్ లోని కాలారామ్
ఆలయంలో, పదిహేను రోజులు శ్రీ రామనవమి
ఉత్సవాలు జరుపుతారు.
రెండవ రోజు,
రధయాత్రోత్సవం ,
రధోత్సవం చూడడానికి
రధం లాగడానికి , భక్తులు
దేశం నలుమూలల నుండి
వస్తారు.
* శ్రీరామనవమి*
************************
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. మద్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ రాముడి కల్యాణం జరుగుతుంది. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.
భద్రాచలం లో శ్రీ రాముని
చతుర్భుజరామునిగా
దర్శిస్తాము. ఆయన హస్తాలలో, శంఖు,చక్రం
విల్లు, బాణాలు వుంటాయి.
ఉత్తర తూర్పు దిశలో శ్రీ రామ పాదుకలు వున్నాయి. ఇక్కడ వున్న
ఆభరణ ప్రదర్శనశాలలో,
రామలక్ష్మణులు, తానీషాకు యిచ్చిన బంగారు నాణెములు,
భక్త రామదాసు, సీతమ్మకు చేయించిన
చింతాకు పతకము,
రామలక్ష్మణులకు చేయించిన , ఆనాటి
ఆభరణాలు మొదలైనవి
దర్శిస్తాము.
కోదండరాముని ఆలయం
రామేశ్వరానికి పదమూడు కి.మీ దూరం లో వున్నది . రామాయణంలో, రామేశ్వరానికి ప్రాముఖ్యత వున్నది.
లంకకు వెళ్ళేందుకు సేతువు యిక్కడే నిర్మించబడింది.
1964లో వచ్చిన తుఫాను కి కోదంరామస్వామి ఆలయం యేమీ దెబ్బ
తిన లేదు.
ముడికొండాన్ కోదండరాముని ఆలయం, నన్నిలం అనే
ఊరికి దగ్గర వున్నది.
ఇది రెండువేల సంవత్సరముల నాటి
ప్రాచీన ఆలయం.
ఈ ఆలయంలో శిరసున
కిరీటం తో, శ్రీ రాముని దర్శిస్తాము.
అయోధ్యలో జరిగిన పట్టాభిషేకానికి ముందే
యిక్కడ పట్టాభిషేకం
జరిగినట్లు భక్తులు చెప్తారు.
కుంభకోణం లోని శ్రీ రామస్వామి ఆలయం
చూడవలసిన ఆలయం.
గర్భగుడిలో పట్టాభిషేక
మూర్తిని దర్శిస్తాము.
ప్రాకారంలో అనేక రామాయణ చిత్రాలు
చిత్రీకరించారు. చూసేవారిని ఆశ్చర్యపరుస్తాయి.
బీహార్, ఛత్తీస్ గఢ్,గుజరాత్, హర్యానా,
హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్
మొదలైన ప్రదేశాలలో
ఉత్సవాలు జరుగుతాయి.
ఆంధ్రా, తెలంగాణాలలో
సీతారాముల కళ్యాణం,
నవరాత్రి ఉత్సవాలను
వైభవంగా జరుపుతారు.
మహారాష్ట్ర చిన్వాల్ గ్రామంలో, బాల రాముణ్ణి
ఉయ్యాలలో శయనింప చేసి ఉత్సవం చేయడం
విశేషం.
కర్ణాటకలో శ్రీ రాముని
ఆలయాలలో పానకం
ప్రసాదంగా పంచి పెడతారు.
దక్షిణ ఆఫ్రికా, జమైకా, పశ్చిమ ఆసియా దీవులు.
మారిషస్, మలేషియా
సింగపూర్, ఫిజీ దీవుల్లో
కూడా ఘనంగా శ్రీ రామనవమి ఉత్సవాలు,
జరుపుతారు.
శ్రీ రామ నవమి నాడు
భక్తులు సరయూ నదిలో
స్నానం చేసి, ఆలయానికి
వెళ్ళి శ్రీ రాముని దర్శిస్తారు.
సరయూ నది ని అందరూ
పూజిస్తారు. కారణమేమిటి అంటే
శ్రీ రాముడు సరయూ నదిలో అవతారం చాలించినట్లు, చరిత్రలో
వున్నది..
*ఆయుర్వేద రహస్యం *
*******************************
ఈ రోజు బెల్లం, మిరియాలు కలిపి చేసిన పానకం, వడపప్పు (నానపెట్టిన పెసరపప్పు) నివేదన చేయాలి. దీనికి ఆయుర్వేదంలో ప్రాశస్య్తం ఉంది. రామనవమి వసంత నవరాత్రుల్లో చివరి రోజున చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు శిశిర ఋతువు ముగుసి వసంతఋతువు ప్రారంభంలో వస్తాయి. ఋతువుమార్పు వలన ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. పానకంలో వేసే మిరియాలు ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబులను నివారిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాని మిరియాలకు వేడిని కలిగించే లక్షణం ఉంది, దానికి విరుగుడుగా బెల్లం నీళ్ళు, వడపప్పు పెడతారు. ఇవి చలువ చేస్తాయి. పెరుగుతున్న ఎండల నుంచి తట్టుకోవాలంటే చలువ చేసే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అందుకోసమే వడపప్పు, పానకం నివేదన. కనుక శ్రీరామనవమి రోజు తప్పకుండా వడపప్పు, మిరియాలతో చేసిన బెల్లం పానకం తీసుకోవడం వలన రామనుగ్రహంతో పాటు ఆరోగ్యం రక్షించబడుతుంది.
అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు
కామెంట్‌లు