ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం

ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎరలతో నిండిన బండి లాగుతూ వెళ్తోందట... పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యిమని ఆ నక్క ముందు వాలి, ఆ ఎరలు కావాలని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను. కానీ కొంత వెల అవుతుంది అన్నదట. దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలీ, ఎంతవ్వాలి అని అడిగితే, నీ రెండు ఈకలు ఇస్తే, నేను ఒక ఎరను ఇస్తాను అని నక్క అన్నదట.గ్రద్ద తన రెండు ఈకలు పీకి ఇచ్చిందట.నక్క వాటిని తీసుకుని ఒక ఎరను తీసి ఇచ్చిందట.దాన్ని తింటూ ఆహ ఎంత రుచిగా ఉంది.మల్లీ ఇంకొకటి తిందాం"అని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చిందట.అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలనిచ్చి ఎరలను కొంటూ వచ్చిందట ఆ గ్రద్ద.

చివరికు ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి.అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట.గ్రద్ద తేరుకొని, నిజం తెలుసుకొనే లోగ తన ఈకలన్ని ఊడి, పైకి ఎగరలేకపోయింది. నక్క అమాంతం గ్రద్ద పైబడి చీల్చి తినేసింది. విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని, దేవుడిచ్చిన ఎగిరే శక్తిని కోల్పోయి చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద. 

సరిగ్గా మన జీవితంలో కుడా, మనల్ని ఆకర్షించి, ప్రలోభపెట్టి మనకు తాత్కాలిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే విషయాలే మన పాలిట విషప్రాయాలై మన జీవితాలను విషాదంలో ముంచేస్తాయి. ఆకర్షణల ప్రలోభాల కారణంగా మన దృష్టి మరల్చబడుతుంది. మనిషి యొక్క లక్ష్యాన్ని, ఏకాగ్రతను,భగ్నం చేసే  పరిస్థితులు, ప్రలోభాలు అడుగడుగునా ఎదురవుతూనే  ఉంటాయి, ఒక వ్యక్తి తన ముందున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో ఆకర్షణలు, ప్రలోభాల రూపంలో ఎదురవుతుంటాయి, ఎదుర్కోని తీరాల్సి వస్తుంది...


💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.