అన్నవరం సత్య నారాయణ స్వామి

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ...రధాకృతిలో ఆలయ నిర్మాణం.

భూలోక సంరక్షణార్ధం భువిని స్వర్గంలా మరిచే క్రమంలో వరప్రసాద ఫలంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రత్నగిరిపై అంకుడు చెట్టు మొదల్లోని పుట్టలో స్వయంభువై అవతరించాడు. ఈ శుభ ఆవిర్భావానికి దేవతలంతా సంతసించి, పులకించి పుష్పవృష్టి కురిపించారు.స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలు గా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు.  గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహా విష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నా ను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు .మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు. రధాకృతిలో ఆలయ నిర్మాణం గావించారు.స్వామిని ప్రతిష్టించిన ఆలయ నిర్మాణం అపూర్వం. రెండతస్తులుగా ఉండే స్వామి వారి ప్రధాన ఆలయం క్రింది భాగంలో యంత్రాలయం పై భాగంలో స్వామి వారి దివ్యమంగళ రూపం దర్శన మిస్తాయి. రెండింటికీ మధ్య పానిపట్టము వంటి నిర్మాణం. అందు పీఠములు బిజాక్షర  సంపుటి యంత్రం ఉంది. ఈ వాస్తు నిర్మణంలోని క్రింది భాగంలో వృతకారమైన  శిలాయంత్రం బ్రహ్మ స్వరూపమని నడుమనున్న లింగాకార స్తంభం శివస్వరూపమని, ఊర్ధ్వమండలి విగ్రహం నారాయణ స్వరూపమని పండితులు చెబుతారు శ్రీ స్వామివారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకులై  అనంత లక్ష్మీ సత్యదేవి సమేతమై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా భక్త రక్షణ చేయటం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.