స్మార్తం అద్వైతం శంకరాచార్యులు

స్మార్తం అద్వైతం శంకరాచార్యులు




స్మార్తం (లేదా స్మార్త సాంప్రదాయం) హిందూమతం యొక్క ప్రధాన శాఖలలో ఒకటి. వేదాలను మరియు శాస్త్రాలను అనుసరించే వ ారిని స్మార్తులు అంటారు. స్మార్తులు ప్రధానంగా ఆది శంకరాచార్యుడు ప్రవచించిన అద్వైత వేదాంత తత్త్వాన్ని అనుసరిస్తారు. అయితే వీరు ఇతర తత్త్వాలను ప్రవచించి, అనుసరించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి.సంస్కృతంలో స్మార్త అంటే "హిందూ స్మృతులపై ఆధారపడినవి లేదా స్మృతులలో పొందుపరచబడిన వాటికి సంబంధించిన, సాంప్రదాయంపై ఆధారపడిన లేదా సాంప్రదాయ న్యాయము లేదా వాడుకకు సంబంధించినవి" అని అర్ధం. ఈ పదం స్మృ (గుర్తుకు తెచ్చుకొనటం) అన్న మూల సంస్కృత ధాతువు నుండి ఏర్పడింది. శ్రుతి యొక్క వృద్ధి కారకం శ్రౌత అయినట్టే స్మృతి యొక్క వృద్ధి కారకం స్మార్త. అద్వైతం   వేదాంతానికి చెందిన ఒక ఉపశాఖ లేదా తాత్విక వాదం. హిందూ తత్వశాస్త్రాల ప్రకారం దీని అర్థం "వేదముల లక్ష్యము".వేదాంతాల ఇతర ఉపశాఖలు ద్వైతం మరియు విశిష్టాద్వైతం. అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాఋ. అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధ చైతన్యము , జీవ పరమాత్మల భేదము, అవిద్య (మాయ), మాయా చైతన్యాల సంబంధమూ , ఈ ఆరూ అనాదులని చెబుతారు. ప్రపంచంలో సృష్టి , మొదలైనవి పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక క్రమపద్ధతిలో జరగాలంటే సర్వనియామకుడైన వాడొకడున్నాడని అంగీకరించాలి. అలా కాకుండా, స్వభావంచేతనే సృష్టి జరుగుతోందని అంటే, దాన్లో ఒక పద్ధతీ, నియమమూ ఉండకూడదనేది స్పష్టమవుతుంది. నామ రూపాలచేత విడిగా కనిపించే అనేకమంది కర్తలతోను, కర్మఫలాలను అనుభవించే భోక్తలతోను, ఊహించడానికి కూడ శక్యంగాని విధంగా సృష్టి రచనావిధానం తెలియబడుతోంది. బ్రహ్మసూత్రాల్లో “జన్మాద్యస్య యతః “ - అంటే ఈ జగత్తుయొక్క జన్మ- స్థితి - ప్రళయములు దేనివల్ల కల్గుతున్నాయో, అది బ్రహ్మము అని చెప్పబడింది. సృష్టి అంటే యిదివరలో లేనిది, ఇప్పుడు కల్పించబడి కన్పించేదని స్థూలంగా అనుకోవచ్చు. “సృష్టికి పూర్వం బ్రహ్మమొక్కటే ఉండెను. మాయలచేత బహురూపమైన బ్రహ్మ ప్రత్యక్షమైనది. దీనికి కారణం ఏదీ లేదు. కార్యం కూడ ఏదీ లేదు. ద్వితీయ వస్తువేదీ లేదు. ఈ ఆత్మయే బ్రహ్మ. సర్వమునూ అనుభవించేది, తెలుసుకొనేదీ” అనే వాక్యాలు ఛాందోగ్యోపనిషత్తు యందు చెప్పబడ్డాయి సూత్రాలు అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరాచార్య వచనాలు - బ్రహ్మ సత్యం జగన్మిధ్యజీవొ బ్రహ్మైవ నా పరః బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు మిధ్య. ఈ జీవుడే బ్రహ్మం. జీవుడు, బ్రహ్మము వేరు కాదు. - ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది. అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిధ్య కావడమేమిటి? ఏనుగు తరుముకొస్తుంటే పారిపోవక తప్పదు కదా? - ఇందుకు మాయావాదం వివరణ : జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే (అనగా అది యదార్ధమన్నట్లుగానే) ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఇదంతా మిధ్య అన్న జ్ఞానం గోచరమౌతుందో అపుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతట అదే వస్తుంది. భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడు కూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు. ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు. మరి ఈ ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి? "ఆత్మానాత్మ వివేకం" అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు - ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది? పూర్వ జన్మ లలోని కర్మ వలన. కర్మ ఎందుకు జరుగుతుంది? రాగం (కోరిక) వలన. రాగాదులు ఎందుకు కలుగుతాయి? అభిమానం (నాది, కానాలి అనే భావం) వలన. అభిమానం ఎందుకు కలుగుతుంది? అవివేకం వలన అవివేకం ఎందుకు కలుగుతుంది? అజ్ఞానం వలన అజ్ఞానం ఎందుకు కలుగుతుంది? అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానం. అనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.