అమృత వాక్కులు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


                *అమృత వాక్కులు:* 
                    ➖➖➖✍


1.
సహృదయంతో        ఏమి   ఆశించకుండా ఇతరులకు మేలు చేసినప్పుడు మీకు అంతా మేలే జరుగుతుంది!
ఇది ప్రకృతి నియమం!!


2.
మానవులకు భగవంతుడిచ్చిన అపురూప కానుక విశ్వం - ఈ ప్రకృతి!


3.
మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చూసుకోవాలి!


4.
పొగడ్తలు, ప్రశంసలు మనిషి విజయానికి ప్రతి బంధకాలు!


5.
ప్రతి నిత్యం చేసిన పనిలో    పరిశీలనా శక్తి లేనిచో      మానవ జీవితమునకు  సార్థకత చేకూరదు!


6.
దేవుడు అంతర్యామి గనుక ఎంతటి వాడిలో అంతటి వాడుగా ఉంటాడు!


7.
మీ కంటితో చూడని, చెవితో వినని విషయాలను నమ్మకండి,వాటిని ఇతరులతో పంచుకోకండి! అసూయాపరులు చెప్పే అబద్ధాలవలన అనుబంధాలు అభాసుపాలౌతాయి!!


8.
ప్రార్థన ప్రార్థించండి కానీ, అది బిచ్చమెత్తుకున్నట్లు కాదు....! చివరకు భగవంతుని కూడా ఏమి కోరుకోవద్దు!!కోరుకోవాలంటే చేసిన తప్పులకు క్షమాపణ, జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే!!!


9.
మనం ఇచ్చింది మరిచి పోవడం., ఇతరులవద్ద పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం!


10.
నీ అంతరాత్మే నీకు మంచి స్నేహితుడు!తరచుగా దాని మాట వినవలసిందే!!


11.
అయితే... పంతం కోపం ఉన్న వ్యక్తి స్నేహానికి పనికి రాడు!!!


12.
గర్వం శత్రువులను పెంచుతుంది.
మితృలను పారద్రోలుతుంది.


13.
సుఖ శాంతులనేవి ఒకరికి నీవు ఇచ్చేదానిపై ఆధార పడి ఉంటాయి!
అంతే కానీ‌, వారి నుంచి నీవు పుచ్చుకునే వాటిపై కాదు.!!


                            🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.