శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం - మురడి

అనంతపురం జిల్లా లో వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం మురడి..

అత్యద్భుతమైన శక్తి గల ఆంజనేయ స్వామి దేవస్థానం..

కసాపురం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అంత ఖ్యాతి గలదివ్య క్షేత్రమే మురడి..

శ్రీ వ్యాస రాయులు ఒకే ముహూర్తం లో మూడు చోట్ల విగ్రహ ప్రతిష్టాపణ చేశారు. ఒకటి శ్రీ కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం గుంతకళ్ళు దగ్గర,శ్రీ మురిడి ఆంజనేయ స్వామి దేవస్థానం మరియు శ్రీ నేమకల్లు ఆంజనేయ స్వామి దేవస్థానం రాయదుర్గం దగ్గర. ఈ మూడు దేవస్థానాలు ఒకే జిల్లా లో ఉండటం విశేషం..

ఈ ఆలయాలను క్రీ.పూ 450 సంవత్సరంలో ఆలయాలను నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు...

 ఒకే నక్షత్రంలో ప్రతిష్టించిన శ్రీఆంజనేయస్వామి ఆలయాలను పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శనివారాల్లో దర్శిస్తే మంచి జరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు.

ఇక్కడ స్వామి వారు మూడు అడుగులు ఉండటం చేత మురడి అని పేరు వచ్చింది. కన్నడం లో మురడి అంటే మూడు అడుగులు అని అర్ధం. ఆలయ రాజా గోపురం చాల బాగుంటుంది ... గోపురం లో హనుమంతుడు చుట్టూ రామాయణ గాద సంబందించిన చిత్రాలను మనం చూడవచ్చు.

అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకలోని డీ హీరేహాళ్‌ మండల పరిధిలో ఉన్న మురడి గ్రామంలో శ్రీ మురిడి ఆంజినేయస్వామి ఆలయం ఉంది..

.ఇక్కడికి చేరుకోవడానికి అనంతపురం నుంచి రాయదుర్గం మీదుగా వెళ్ళాలి. రాయదుర్గం నుంచి పది కిలో మీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. కర్ణాటక ప్రాంతామైన బళ్లారి నుంచి 45 కిలోమటర్ల దూరంలో ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.