శ్రీ గురుపాదుక - Gurupaduka
శ్రీ గురుపాదుక
సామాన్య మానవులు కాళ్ళకి రక్షణకోసం చెప్పులు తొడుక్కొని తిరుగుతారు . వాటిని జంతువుల చర్మంతో చేస్తారు . అవి హింసాపూరితం కాబట్టి మహాత్ములు కొయ్యతో తయారయిన పాదుకలను ధరిస్తారు . అంతేకాదు , అడవులలో ఏకాంత ప్రదేశాలలో సంచరించేటప్పుడు నేలమీద తిరుగాడుతుండే పురుగు , పుట్ర పాదుకల చప్పుడు వినబడగానే దూరానికి పోతాయి . వాటికి గాని , సాధువుకు గాని ప్రమాదం కలగదు . సామాన్య మానవులు నేల ఆధారంగా నిలబడితే , మహాత్ములు సత్యం ఆధారంగా నిలబడతారు . మనం వెదుక్కునే పరమసత్యానికి అతి చేరువగా ఉంటాయి గురుపాదుకలు .
అందువల్ల పాదుకలే పరమసత్యమని భావించి ఉపాసిస్తారు శిష్యులు . పాదుకలు రెండు ఉంటాయి . అయినా పాదుక అని ఏకవచన ప్రయోగం సంస్కృతంలో పరిపాటి . హృదయంలో రెండు పాదుకలని గురించి భావన ఉంటుంది . ఒకటి పరం , రెండోది అపరమైన ప్రపంచము . ఇందుండి బయటపడడానికి మనం అవలంభించే సాధనా విధానాలు కూడా అపరమైనవే . అందుచేత పాదుకా ఉపాసనలో పాదుకలనే అద్వయమైన పరమాత్మగా భావించి ధ్యానించడం జరుగుతుంది .

కామెంట్‌లు