🌼🌿శ్రీ కంచి కామాక్షీ దేవి🌼🌿

'శ్రీ కామాక్షీ దేవి' శక్తి పీఠం చెన్నైకి సమీపంలోగల 'కంచి'లో వుంది. అమ్మవారు 'వడ్డాణం'(కాంచి )ధరించిన భాగం ఇక్కడ పడటం వలన, ఈ శక్తి పీఠానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు తీర్చు కొంగు బంగారమై అలరారుతున్నది. ప్రతి నిత్యం అమ్మవారిని ముందుగా ఆవు - దూడ, ఆ తరువాత ఏనుగు దర్శనం చేసుకోవడం ఇక్కడి ఆనవాయతి. ఆ తరువాతనే భక్తులకు ప్రవేశం వుంటుంది.

ఒకానొక శాపకారణంగా కాత్యాయన మహర్షి కూతురిగా పెరిగిన పార్వతి, ఆ తరువాత కాంచీపురానికి చేరుకొని 'ఏకామ్రేశ్వర' సైకత లింగాన్ని పూజించి శివుడి మనసు దోచుకుంది. విష్ణుమూర్తి వారి వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తాడు. ఆ సంతోషంలో పార్వతీదేవి తన కంటి చూపుతోనే భక్తుల కోరికలను నెరవేర్చింది. అది గమనించిన శివుడు 'కామాక్షీ దేవి' పేరుతో వర్ధిల్లమంటూ అనుగ్రహించాడు.

ఈ వివాహానికి వచ్చిన దేవతలు ... ఋషులు ఆది దంపతులను అక్కడే కొలువై ఉండమంటూ ప్రార్ధించారు. వారి కోరికను మన్నించి కామాక్షీ - శంకరుడు అక్కడే వెలిసి ఆ ప్రదేశాన్ని ముక్తి క్షేత్రంగా మార్చారు. ఇక్కడ శివుడు ఏకామ్రేశ్వరుడు పేరుతోను ... విష్ణువు, వరదరాజస్వామి పేరుతోను పూజలు అందుకుంటూ ఉంటారు.


శ్రీ కామాక్షీ దేవి స్తోత్రము

కారణపరచిద్రూపా కాఞ్చీపురసీమ్ని కామపీఠగతా । కాచన విహరతి కరుణా కాశ్మీరస్తబకకోమలాఙ్గలతా ॥ ౧॥ మూ.ప. ఆ. ౧ కఞ్చన కాఞ్చీనిలయం

కరధృతకోదణ్డబాణసృణిపాశమ్ । కఠినస్తనభరనమ్రం కైవల్యానన్దకన్దమవలమ్బే ॥ ౨॥ మూ.ప. ఆ. ౨

ఐశ్వర్యమిన్దుమౌలేరైకాత్మ్యప్రకృతి కాఞ్చిమధ్యగతమ్ । ఐన్దవకిశోరశేఖరమైదమ్పర్యం చకాస్తి నిగమానామ్ ॥ ౩॥ మూ.ప. ఆ. ౭

లీయే పురహరజాయే మాయే తవ తరుణపల్లవచ్ఛాయే । చరణే చన్ద్రాభరణే కాఞ్చీశరణే నతార్తిసంహరణే ॥ ౪॥ మూ.ప. ఆ. ౭౨

కామపరిపన్థికామిని కామేశ్వరి కామపీఠమధ్యగతే । కామదుఘా భవ కమలే కామకలే కామకోటి కామాక్షి ॥ ౫॥ మూ.ప. ఆ. ౪౯

సమరవిజయకోటీ సాధకానన్దధాటీ మృదుగుణపరిపేటీ ముఖ్యకాదమ్బవాటీ । వర్ మృదుగుణగణపేటీ మునినుతపరిపాటీ మోహితాజాణ్డకోటీ పరమశివవధూటీ పాతు మాం కామకోటీ ॥ ౬॥
మూ.ప. స్తు. ౧౦౦

జయ జయ జగదమ్బ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే ।
జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగనకౌముదీధారే ॥ ౭॥

ఓం శ్రీ మాత్రే నమః

సేకరణ శ్రీ లలితా fb post

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.