గరుడ పురాణం గురించి తెలుసుకుందాం.!

మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా, ఆసక్తిగా గరుడపురాణం చదవడా నికి చాలా మంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు. ఈ పురాణంలోని విష యాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం, జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో శ్రాద్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.

ఇలాంటి సందర్భాల్లో గరుడపురాణం చదవడం వలన చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఉత్తమగతులు కలగడానికి తాము చేయవలసిన విధుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా తాము ఎలాంటి పనులు చేయకూడదనే విషయాలు కూడా బోధపడతాయి. నిజానికి ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినవే. అయితే ఎవరైనా చనిపోయి నప్పుడు గరుడపురాణం చదవాలనే విషయాన్ని అంతా పక్కనపెట్టేశారు. గరుడపురాణం చదవడం వలన ఎవరైనా పోతారేమోననే సందేహమే ఎక్కువగా ప్రచారాన్ని సంతరించుకుంది. ఈ కారణంగానే 'గరుడ పురాణం' ఎవరి ఇంట్లో కనిపించకుండా పోయింది, ఎవరి నోటా వినిపించకుండా పోయింది. పరలోకంలో 'ఆత్మ'గా జీవుడు కొనసాగించే యాత్ర గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే వ్యాస భగవానుడు దానిని రచించాడు కనుక, నిస్సందేహంగా ఈ పురాణాన్ని చదవవచ్చని పండితులు తేల్చిచెబుతున్నారు.

గరుడపురాణం ఏం చెబుతోంది?

కొన్ని విషయాలని, పాపాలని గరుడపురాణం తెలియచేస్తోంది. అవి బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నర కంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాత కులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసే వారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవత లను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట.


పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించే వారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు. అంటే, తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించే వారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు,

ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వొద్దని ఆపేవారు, యజ్ఞ విధ్వంసకులు, హరికథకు లకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసే వారు, పశుహత్య చేసేవారు, యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట.

యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ము లను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగిం చేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపు రాణం చెప్తుంది.

*మనిషికి ఉండాల్సిన లక్షణాలు...*

ప్రతి మనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాప భీతి కావచ్చు, ఏదైనా ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందు చూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవే త్తలు చెబుతున్నారు.

అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచుకోవడా నికి ప్రయత్నిస్తారు. అయితే, బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవా లని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.