కారణ జన్ముడు -బ్రాహ్మణుడు
🙏కారణ జన్ముడు -బ్రాహ్మణుడు🙏
వైభవ వేద వాంగ్మయ విజ్ఞానాన్ని విపులముగా అందించు విప్రుడు
కారణ జన్ముడు.
భగవంతుడు తనకు కాపాలాదారునిగా
సృష్టించుకున్న ముద్దు బిడ్డ బ్రాహ్మణుడు.
ప్రతి శిలలో శివున్ని,
నల్ల రాయిలో నారాయణున్ని
ప్రతి మదిలో అమ్మవారి రూపాన్ని చూస్తాడు.
పూసిన ప్రతి పువ్వు
తన స్వామిని చేరాలను కుంటాడు.
చేసే ప్రతి పనిలో అది ఆశీర్వచనమైనా,
అర్చకత్వమైనా,పురోహితమైనా,యజ్ఞ,యాగ,మహా వ్రతములైన,ఉద్యోగమైన,వ్యాపారమైన,వృత్తి ఏదైనా
ప్రవృత్తి మాత్రం నమ్మకమైన
సంస్కార జీవనం
అందుకే
నలుదెసల
అంతటి గౌరవం
పాషాణ హృదయంలో
కూడా సౌకుమార్యాన్ని గాంచుతాడు.
అందరినీ ఆదరిస్తాడు
తనకు తోచిన సాయం
చేస్తాడు.
దేవుని ముందు దీపం వెలిగించడమే కాదు
అందరి జీవితాలు
దేదీప్య కాంతులతో
ప్రకాశించాలని ప్రార్ధిస్తాడు
అందరూ వందనం అని
అంజలి ఘటించేలా ప్రవర్తిస్తాడు.
నీవు లేనిచో
సనాతన ధర్మం లేదు
సశాస్త్రీయ వివరణ లేదు
హైందవ జాతి లేదు
హైందవాన్ని భారత్ నుండి పారద్రోలాలనే
విధర్మీయులకు అడ్డుకట్ట నీవు.
రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే *ముందు కోటను కొట్టాలి
అందుకే దేశాన్ని,ధర్మాన్ని *ఆక్రమించాలనుకునే
ప్రతి ఒక్కరు మొదట నిన్నే గురిపెడతారు
నీపై పగ పడతారు.
ఐనా నిన్ను కాపాడే దైవం మనుష్యరూపంలో సదా నిన్ను రక్షిస్తూ,ధర్మ రక్షణ గావిస్తూ ఉంటుంది
ఈ కర్మ భూమిలో
ఓ పుణ్య జీవి!
ఓ ధన్యజీవి!
నీ ఖ్యాతి అజరామరం
నీ జీవనం కారణ జన్మం
నీకిదే నా అక్షర సుమాభిషేకం
నా పాదాభివందనం....
ఓ బ్రాహ్మణుడా!
కామెంట్లు