గయా శ్రాద్ధము - పంచ గయలు

గయా శ్రాద్ధము - పంచ గయలు
వాయు పురాణం, భాగవత పురాణం ప్రకారం- త్రేతాయుగకాలములో, గయా సురుడు
ప్రసిద్ధి చెందిన తపస్వి, రాక్షసుడు. మహా విష్ణుభక్తుడు, తన తపోశక్తిచే తన శరీరమును
పరమ పవిత్రంగా మలచుకుని, దానిని తాకిన ఏ ప్రాణి అయినా ముక్తి పొందేలా చేసుకోగలిగిన వాడు.
అయితే, వైదిక కర్మలు నశించి వాటి పునరుద్ధరణకు బ్రహ్మాదులు యజ్ఞము చేయవలసి వచ్చినప్పుడు గయుని శరీరము పై బ్రహ్మ చేసిన యజ్ఞము తరువాత మూడు
భాగములైన తన శరీరం దివ్య క్షేత్రాలుగా, సకల తీర్థాలకన్నా పరమ పవిత్రంగా పితరులను
తరింపజేసే దివ్యధామాలుగా మారడానికి కూడా శ్రీ మహావిష్ణువుచేత వరం పొందాడు.
ఆ వరప్రభావముతోనే యజ్ఞానంతరం శరీరము శిరస్సు, నాభి, పాదములు అనే మూడు
భాగములుగా పడిన ప్రదేశములు, శిరోగయ, నాభిగయ, పాదగయ అనే మూడు
గయా క్షేత్రములుగా ప్రస్తుతం 
1)బుద్ధగయ (బీహార్), 
2)జాజిపూర్ (ఒరిస్సా), 
3)పిఠాపురం(ఆంధ్రప్రదేశ్) 
అనే పేర్లతో వున్నాయి.
వీటితో పాటు ప్రస్తుతము గుజరాత్ రాష్ట్రములో వున్న 4)మాతృగయ (సిధ్పూర్), 
హిమాలయములలో నరనారాయణులు తపమాచరించిన 5)బదరీనాథ్ క్షేత్రములో వున్న బ్రహ్మకపాలము అనే రెండు క్షేత్రములు కలిపి పితృ యజ్ఞము చేయవలసిన పంచ గయలుగా ప్రసిద్ది చెందినవి.
పితరులకొరకు ఈ పంచ గయాక్షేత్రములలో తీర్థ శ్రాద్ధము ఆచరించినట్లైతే వారు మరింత ప్రీతులవుతారని, శిరోగయా క్షేత్రములో మరియు బ్రహ్మ కపాలములో శ్రాద్ధము నాచరించిన వారి పితరులకు శాశ్వత పరబ్రహ్మ లోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనము.
అందుకే గయాశ్రాద్ధమునకు అత్యంత ప్రాముఖ్యత నిచ్చి శ్రాద్ధమును ఎక్కడ ఆచరించినా "గయా శ్రాద్ధ ఫలితమస్తు" అని బ్రాహ్మణులచే దీవెనలు పొందుతారు.

*షోడశసంస్కారములు-అపరకర్మలు, పితృయజము- పరిచయము*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.