భక్తి దాని స్వరూపం
🌹 భక్తి దాని స్వరూపం. 🌹
మానవ జీవన వికాసాన్ని అభివృద్ధి పరచడంలో భక్తి యొక్క పాత్ర విశిష్టమైనది ...
సనాతన భారతీయ ఋషులు తొమ్మిది ( 9 ) విధములైన భక్తి మార్గములను ఉపదేశించారు ....
శ్లోకం :
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణ
పాదసేవనం అర్చనం వందనం దాస్య
సఖ్యమాత్మనివేదనం ...
1. భగవంతుని లీలలు వినడం ( శ్రవణం )
2. ఆయన లీలలను ( కీర్తించడం )
3. అదే పని గా భగవంతుని నామ ( స్మరణం ) చేయడం
4. స్వామి వారి ( పాదసేవనం ) చేయడం
5 . స్వామిని ( అర్చించడం )
6 . భక్తి తో ( వందనము ) చేయడము
7 . దాస భక్తి తో స్వామి కి దాసుడుననే భావముతో (దాస్యము ) చేయడము
8 . స్వామి నా చెలికాడు అనే భావనతో ( సఖ్యము ) చేయుట
9 . స్వామీ నీవే నా సర్వస్వము , మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావనతో ( ఆత్మ నివేదన ) చేయడం
ఈ విధమైన భక్తి మార్గముల ద్వారా మనుష్యుడు పరమపదాన్ని చేరుకోవచ్చు ... ఐతే ఖచ్చితంగా ఈ తొమ్మిది ( 9 ) మార్గములు అనుసరించాలి అన్న నియమం లేదు . వారి వారి పుణ్యకర్మలను అనుసరించి భగవంతుడు వారి ఉపాధికి తగిన మార్గాన్ని చూపుతారు .
ఉదాహరణకు : కీర్తనం అనే భక్తి మార్గం ద్వారా , శుకబ్రహ్మ పరమాత్మ ను చేరితే , దాస్యం ద్వారా హనమంతాది భక్త పరాయణులు చేరుకున్నారు ....
జై గురుదేవా🙏🌹🙏
🚩🌹🌹🌹🌹🌹🌹🚩
కామెంట్లు