భక్తి దాని స్వరూపం

🌹 భక్తి దాని స్వరూపం.  🌹

మానవ జీవన వికాసాన్ని అభివృద్ధి పరచడంలో భక్తి యొక్క పాత్ర విశిష్టమైనది ...
సనాతన భారతీయ ఋషులు  తొమ్మిది ( 9 ) విధములైన భక్తి మార్గములను ఉపదేశించారు ....

శ్లోకం  : 
 
శ్రవణం కీర్తనం విష్ణోః  స్మరణ      
పాదసేవనం అర్చనం వందనం దాస్య  
సఖ్యమాత్మనివేదనం ...

1.  భగవంతుని లీలలు వినడం  ( శ్రవణం  ) 
2.  ఆయన లీలలను  (  కీర్తించడం )
3.  అదే పని గా భగవంతుని నామ  ( స్మరణం ) చేయడం 
4.  స్వామి వారి ( పాదసేవనం ) చేయడం 
5 . స్వామిని ( అర్చించడం )  
6 . భక్తి తో ( వందనము ) చేయడము 
7 . దాస భక్తి  తో స్వామి కి దాసుడుననే  భావముతో  (దాస్యము )  చేయడము 
8 . స్వామి నా చెలికాడు అనే భావనతో ( సఖ్యము ) చేయుట 
9 . స్వామీ నీవే నా సర్వస్వము ,  మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావనతో  ( ఆత్మ నివేదన ) చేయడం 
         
ఈ విధమైన భక్తి మార్గముల ద్వారా మనుష్యుడు పరమపదాన్ని చేరుకోవచ్చు ... ఐతే ఖచ్చితంగా ఈ తొమ్మిది ( 9 ) మార్గములు అనుసరించాలి అన్న నియమం లేదు . వారి వారి పుణ్యకర్మలను అనుసరించి భగవంతుడు వారి ఉపాధికి తగిన మార్గాన్ని  చూపుతారు . 
ఉదాహరణకు : కీర్తనం అనే భక్తి మార్గం ద్వారా , శుకబ్రహ్మ పరమాత్మ ను చేరితే , దాస్యం ద్వారా హనమంతాది భక్త పరాయణులు చేరుకున్నారు ....                         
                                   
జై గురుదేవా🙏🌹🙏
🚩🌹🌹🌹🌹🌹🌹🚩

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.