అష్టదిక్కులు అంటే ఏమిటి? దిక్పాలకులు ఎవరు?

అష్టదిక్కులు అంటే ఏమిటి? దిక్పాలకులు ఎవరు?

మనకు 4 దిక్కులు ఉన్నాయని అందరికీ తెలుసు. అవే తూర్పు పడమర, దక్షిణం ఉత్తరం. అంతేకాదు 4 మూలలు. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం .వాటికి అష్ట దిక్పాలకులు కూడా ఉన్నారు.

ఇంగ్లిష్ మీడియం చదువుల పుణ్యమా అని అవేమిటో కూడా ఇప్పుడు చాలామందికి తెలియదు. అలాంటి వారి కోసమే ఇది... తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ.
మరి దిక్కులు 4 అయితే అష్ట దిక్పాలకులు అనే పదం ఎలా వచ్చింది? అంటే మిగిలిన 4 మూలలు కూడా కలిపి ఆ పదం వచ్చింది.
ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు.

1.ఇంద్రుడు - తూర్పు దిక్కు ఇతని భార్య పేరు శచీదేవి, పట్టణం అమరావతి, వాహనం ఐరావతం, ఆయుధం వజ్రాయుధం.

2.అగ్ని - ఆగ్నేయ మూల
ఇతని భార్య పేరు స్వాహాదేవి, పట్టణం తేజోవతి, వాహనం పొట్టేలు, ఆయుధం శక్తిఆయుధం.

3.యముడు - దక్షిణ దిక్కు
ఇతని భార్య పేరు శ్యామలాదేవి, పట్టణం సంయమిని, వాహనం మహిషం, ఆయుధం పాశం

4.నైరుతి - నైరుతి మూల ఇతని భార్య పేరు దీర్ఘాదేవి, పట్టణం కృష్ణాంగన, వాహనం గుర్రం, ఆయుధం ఈటె.

5.వరుణుడు - పడమర దిక్కు
ఇతని భార్య పేరు కాళికా దేవి, పట్టణం శ్రద్ధావతి, వాహనం మొసలి, ఆయుధం దండం.

6.వాయువు - వాయువ్య మూల
ఇతని భార్య పేరు అంజనాదేవి, పట్టణం నంధవతి, వాహనం లేడి, ఆయుధం ధ్వజము
కుబేరుడు - ఉత్తర దిక్కు

7.ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి, పట్టణం అలక, వాహనం నరుడు, ఆయుధం ఖడ్గం.

8.ఈశాన్యుడు - ఈశాన్య మూల
ఇతని భార్య పేరు పార్వతీ దేవి, పట్టణం యశోవతి, వాహనం వృషభం, ఆయుధం త్రిశూలం.

సేకరణ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.