శంకరా.. ఆది శంకరా ! జగద్గురు

🌼🌿శంకరా.. ఆది శంకరా ! జగద్గురు !! 🌼🌿

సుమారు పన్నెండు వందల సంవత్సరాల - క్రితం కేరళ రాష్ట్రంలోని పూర్ణా -నదీ తీరంలో కాలటి క్షేత్రాన ఆర్యాంబ, శివగురువు అనే  పుణ్య దంపతులకు  ఆ పరమేశ్వరుడే స్వయంగా శంకరాచార్యుల వారి రూపంలో వైశాఖ శుక్ల పంచమి రోజున అవతరించారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీ కృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతలో చెప్పినట్టు ధర్మం  క్షీణిస్తున్నప్పుడు అంటే జనులందరూ స్వధర్మాచరణను కొంచెం కూడా పాటించకుండా ఉన్నప్పుడు జనులం దరి శ్రేయస్సుకై పునః ధర్మ సంస్థాపన చేయ డానికి భగవంతుడు తానే అవతరిస్తానని చెప్పినట్లుగా సాక్షాత్ పరమేశ్వరుడు శంక రాచార్యుల వారి రూపంలో అవతరిం చారు. ఆ సమయంలో బౌద్దది మతాల ప్రభావంతో వీదం, శాస్త్రం, ధర్మం, యాగం అనే శబ్దాలు కూడా వినబడని పరిస్టితి.ఆలాంటి సమయంలో శంకరా చార్యుల వారు .జనులందరికీ సనా తన ధర్మ వైశిష్ట్యాన్ని స్వధర్నాచరణను ప్రబోధిస్తూ అవైదిక - . మతాలను ఖండిస్తూ ధర్మ సంస్థాపన చేశారు.  శంకరులు ఎనిమిది సంవత్సరాల వయస్సు లోనే "చతుర్వేదాలను, పన్నెండు సంవత్సరాల నా వయస్సులో ప్రస్థానత్ర యాది భాష్యాలను  రచించారు.ముప్పై రెండు సంవ త్సరాల వయసులో కైవల్యాన్ని పొందారు.ఇదంతా ఏ ఒక్క మానవ మాత్రునికీ సాధ్యం కాని పని. అందుకే అంటారు 'శంభోరూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా' ఈ జగత్తులో పరమేశ్వ రుడే శంకరాచార్యుల రూపంలో సంచరించారు  ఆని. శంకరాచార్యుల వారికి మాత్రమే జగద్గురువు అనే శబ్దం సార్థకం అవుతుంది. ప్రతి మనిషికీ ధర్మాన్ని ఆచరించడం, అర్థం అంటే సంపాదనం, కోరికలు తీర్చుకోవడం చివరికి ముక్తిని పొందడం, ధర్మ, అర్థ, కామ మోక్షాలు పురు షార్గాలు. ఇవి ప్రతి ఒక్కరికీ జీవిత లక్ష్యాలు, ఆయితే వీటిలో మోక్షం చాలా ప్రధానమైనది. అదీ ఆత్మ జ్ఞానం ద్వారా లభిస్తుంది. ఆత్మజ్ఞానం గురువు వల్లనే లభిస్తుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది గురువు అంటే ఎవరు, గురువు ఎలా ఉండాలి? అని, దానికి చెప్తారు.''కో గురుః' అంటే గురువు ఎవరు? దానికి సమా ధానం... తత్త్వాన్ని అర్థం చేసుకొని శిష్యుడి హితం ఎల్ల ఎప్పుడూ కోరేవాడే గురువు.


 శ్రీ శంకరాచార్యులవారి దగ్గర ఈ లక్షణం సంపూర్ణంగా కనపడుతోంది. ధర్మాన్ని ప్రస్థానత్రయాది గ్రంథాలలో మహా మహా పండితులకు కూడా మళ్లీ మళ్లీ చదివితేనేగాని అర్థం కాని ప్రొడ భాషలోనూ ఎలాంటి శబ్ద జ్ఞానం కూడా లేని సామాన్యుడికి అర్ధం అయ్యేట్టుగా సులభ శైలిలో ఉండే భజగోవిందాది స్తోత్రాలతోనూ ప్రబోధిం చారు. ఆయన సర్వ శాస్త్రాలు తెలిసిన వారు. మానవుఅందరికి శ్రేయస్సుకోసం అపారమైన కృషి చేసిన వారు, ఇన్ని శతాబ్దాలు గడిచినా ఆయన ఉపదేశాలు మానవాళికి మార్గదర్శనం అవుతున్నాయి. | ఉపనిషత్తులలో ప్రతిపాదించిన భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి అద్వైత సిద్ధాం తాన్నే శంకరులు చెప్పారే కానీ ఏ కొత్త సిద్ధాంతాన్ని చెప్పలేదు. ఎందుకంటే మనకు వేదం ప్రామాణికం. | ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. వారి వారి సంస్కారాన్ని అనుసరించి వారి జీవన విధానం ఉంటుంది. అయితే వారందరికీ ధర్మబద్ద మైన జీవనం గడపడం ఎలాగో సూచించగల మహానుభావుడే జగద్గురు ఆదిశంకరులను జగద్గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. | రాము ప్రబోధించినట్లు వంటి సనాతన ధర్మం ఇప్పుడు పిలవబడే హిందూధర్మం సూర్య చంద్రులు ఉన్నంత వరకు మానవాళికి అంది, వారు శ్రేయస్సును పొందాల ఉద్దేశ్యంతో భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మఠాలను స్థాపించారు. 
దాంట్లో... 
1. తూర్పున పూరీలో గోవర్ధన్ పీఠాన్ని, 
2. దక్షిణాన శృంగేరీలో శారదాపీ ఠాన్ని, 
3. పశ్చిమాన ద్వారకలో ద్వారక పీతాన్ని, 
4. ఉత్తరాన బదరీలో జ్యోతిర్మక పీఠాన్ని 

నాలుగు దిక్కులలో నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు పీఠాలను స్థాపించారు. మనకు దక్షిణాన ఉన్నటువంటి , కర్ణాటక రాష్ట్రంలో శృంగేరీ శారదాపీఠం ధర్మాన్ని ప్రభో మీ 'ధిస్తుంది. ఈ పీఠంలో శంకరాచార్యులు' మొద లుకొని ప్రస్తుత పీఠాధిపతులు - శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వరకు ఆవి చ్ఛిన్న గురు పరంపరలో ప్రతి ఒక్కరూ కూడా శంక రాచార్యులే. ఈ మాట శంకరులు స్వయంగా చెప్పి నారు. వీరు నడిచే అమ్మవారి లాగా అమ్మవారే స్వయంగా పురుషాకారం తీసుకుని ఈ భూమి యందు మానవాళిని ఉద్ధరించడానికే నడుస్తున్నది ఆని, ఒక మహాకవీ ఇదే చెప్తారు 'పుంభావం సము పేయుషీ  భగవతి'   ఆది శంకరాచార్యులవారి జయంతి సందర్బాన వారు ఉపదేశించినటువంటి ధర్మాన్ని ఆచరించి మనందరికీ కూడా సద్బుద్ధి, సత్రేరణ, సన్మార్గం కలగాలని శంకరాచా ర్యుల స్వరూపులైన శ్రీ మద్ భారతీ తీర్ధ మహాస్వామి వారికీ, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికీ సవినయ సాష్టాంగ నమ స్సులతో... .

 -వ్యాసోజుల గోపీకృష్ణ శర్మ
శృంగేరీ పండితులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.