సిద్ధులనుగుర్తించటంఎలా?
భారత దేశం కర్మభూమి.లౌకిక ఙ్ఞానానికి అతీతమైన సిద్ధులతో,తమ తపోశక్తితో భారత భూమిని సుసంపన్నం చేసిన సిద్ధులెందరికో ఈ పుణ్యభూమి పుట్టినిల్లు తమ తపోశక్తితో కేవలం, భారత దేశానికే కాక యవత్త్మానవళికి ఉపకారం చేసే సిద్ధ పురుషులు ఈ నాటికి హిమాలయపర్వత శ్రేణ్ణుల్లో ఉన్నారు. అట్టి మహాత్ముల తపోశక్తి వలననే నేడు భారతావని ఈ మాత్రం అయిన సుభిక్షముగా ఉంది. వారి తపస్సు వలన కలిగే ప్రకంపనలు వలనే నేటి భారత దేశం లో ఇంకా ఆధ్యాత్మికత నెలకొని ఉంది. సిద్ధ పురుషులు అఙ్ఞాతముగా ఉంటూ మానవునికి ఊహకందని సేవలు చేస్తూ ఉంటారు.
ప్రకృతి,సూర్యకాంతి,పంచభూతాలు మానవాళికి చేసే ప్రయోజనం ఎటువంటిదో సిద్ధులైన పురుషుల తపోశక్తితో అంతటి ఉపకారం చేస్తు ఉంటుంది. 1)సిద్ధులను గుర్తించటం ఎలా? 2)వారి లక్షణాలు ఎమిటి? 3)వారి నివాసము ఎచ్చట? వంటివి ఆసక్తికరమైన ప్రశ్నలు . అయితే సిద్ధులను గుర్తించటం అంత తేలికైన విషియం కాదు. భగ్వద్గీత,బ్రహ్మ గీత,సుత సమ్హిత,భాగవతం ఇంకా ఉపనిషత్తులతో అక్కడక్కడ సిద్ధులను గురించి చెప్పబడింది. భగ్వద్గీతలో సాంఖ్యాయోగంలో చెప్పబడిన స్థిథ ప్రాఙ్ఞుని లక్షణాలు పూర్తిగా కలిగి ఉన్నవారిని సిద్ధ పురుషులుగా పేర్కొనవచ్చు.
భగ్వద్గీతలో అర్జునుడు స్థిత ప్రఙ్ఞుని గురించి నాలుగు ప్రస్నలు వేశాడు. 1) స్థిత ప్రాఙ్ఞుడు ఎలా ఉంటాడు? అనగా అతని లక్షణములు ఏమిటి? 2)స్థిత ప్రఙ్ఞులు ఏ విధంగా భాషిస్తారు? 3)స్థిత ప్రాఙ్ఞుడు ఏ రీతిగా ఉంటాడు? 4)స్థిత ప్రాఙ్ఞుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు?
పైనాలుగు ప్రశ్నలలో మొదటి ప్రశ్నయే సమగ్రమయినది. మిగిలిన మూడుప్రశ్నలు అందులోని భాగమే . అత్యంత సమగ్రమైన అర్జునుని ఈ ప్రశ్నకు సాంఖ్య యోగం చివరి వరకూ శ్రీ కృష్ణ భగవానుడు సవివరముగ సమాధానం ఇచ్చాడు. మనస్సులోని కోరికలను పూర్తిగా పాలద్రోలి నిర్మల చిత్తంతో ఆత్మయందే స్థిరంగా ఉండి సంతుష్టి పొందే స్థితిని స్థిత ప్రఙ్ఞత్వం అని అంటారు. అట్టి స్థితిని చేరుకున్న సిద్ధుని ప్రతి చర్యలో పవిత్రత ,శాంతి ,దైవత్వం గోచరిస్తుంది.అట్టి సిద్ధుని ముఖం ఎల్లప్పుడూ తృప్తి ,ఆనందంతో తాండవిస్తుంది.అతని హృదయం నిత్యం బ్రహ్మానంద సాగరంలో తేలియాడూతూంటుంది.మనోవికారాలైన రాగభయక్రోధాదులు అతని దరి చేరవు.శరీరధారులు కనుక కొన్ని భౌతికావసరాలకు తప్ప ఏ వస్తువులు యందు ప్రత్యేకమైన కోరిక గాని అమిత ఇష్టంగాని కలిగిఉండరు. సిద్ధులైన మహాపురుషులు దర్శనం వలన కలిగే పుణ్యఫలమును గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువును ” సాధుదర్శనం” వలన కలిగే ఫలం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు “నారదా! భూలోకంలో ఇప్పుడే ఒక పేడపురుగు జన్మించింది.వెళ్ళి దానిని అడుగు. నీ ప్రశ్నకు జవాబు లభిస్తుంది”అన్నాడు.
నారదుడు పేడపురుగు వద్దకు పోయి “సాధుదర్శనం వలన కలిగే ఫలము ఏమిటి? “అని ప్రశ్నించాడు. వెంటన్నే ఆ పేడపురుగు మరణించింది. నారదుడు కంగారుపడి విష్ణువుకు జరిగినదంతా చెప్పాడు. విష్ణువు “నారదా ! భూలోకంలో ఒక గోవు ప్రసవిస్తున్నది.వెళ్ళి ఆ ఆవుదుడను ఇదే ప్రశ్నను అడుగు” అని పంపాడు. నారదుడు తిరిగి భూలోకం వచ్చి అప్పుడే ప్రసవించిన లేగదూడను తిరిగి ప్రశ్నించాడు. ఆ లేగదూడ ప్రశ్న విన్న వెంటన్నే మరణించింది. నారదుడు తనకు గోహత్యా పాపం కలిగింది అని చింతించి ,మళ్ళి విష్ణువు వద్దకు వెళ్ళి జరిగినది అంతా వివరించాడు. వెంటనే శ్రీ మహా విష్ణువు :”ఈ సారి భూలోకంలో ఫలానరాజుగారి భార్య ఇప్పుడే ప్రసవించింది.మగ బిడ్డ పుట్టాడు. ఆ బిద్డను ఈ ప్రశ్న వెయ్యి, నీకు సమాధానం దొరుకుతుంది ” అని చెప్పాడు. నారదుడు సందేహించి “శ్రీమన్నారాయణ ! ఇప్పటికే నావలన రెండు మరణాలు జరిగాయని వ్యాకుల పడుతున్నాను. నీ మాయ నాకు అర్ధం కాకుండా ఉంది. మరోక్కసారి నీవు చెప్పినట్లు చెయ్యటానికి ధైర్యం సరిపొవడంలేదు ,నన్ను అనుగ్రహించు తండ్రి ! ” అని ప్రార్థించాడు . శ్రీ మహావిష్ణువు నవ్వి “ఈ సారి నీ ప్రశ్నకు తప్పక జవాబు లభిస్తుంది.పోయిరమ్ము” అని పంపాడు. నారదుడు భూలోకానికి తిరిగి వచ్చి అప్పుడే ప్రసవించిన రాకుమారుని ” సిద్ధ పురుషులు దర్శన ఫలం ఏమిటి ?” అని ప్రశ్నించాడు. వెంటనే ఆ రాకుమారుడు నారదునికి నమస్కరించి “మహాత్మ! మీ ప్రశ్నకు, నా జీవితమే జవాబు ! నేను ముందు పేడపురుగుగాజన్మించినప్పు దు మీ దర్శనభాగ్యం వలన ఆవుదూడగా ఉత్తమజన్మ లభించింది. టిరిగి మీ దర్శనం వల్లనే ఉత్తమోత్తమైన ఈ మానవ జన్మ లభించింది ” అని జవాబు ఇచ్చాడు. కాబట్టి, సిద్ధ పురుషులు దర్శనం వలన లభించే పుణ్య ఫలం ఎంతని చెప్పగలం?
సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాప నాశనం సంభాషణం కోటితీర్థం, వందనం మోక్ష సాధనం II
సాధువులు అయిన ఙ్ఞానులను దర్శించతం వల్ల పుణ్యం, పాద స్పర్శతో పాపనాశనం,సంభాషించటం వలన అన్ని పుణ్యతీర్థాలలో స్నానము ఆచరించటం వలన కలిగే పుణ్య ఫలం, నమస్కారం చెయ్య తం మోక్షదాయకమని భాగవతం లో చెప్పబడింది. ఏ ప్రదేశాలలో సిద్ధ పురుషులు ఆశ్రమాలు నిర్మిచికుంటారో అక్కడి ప్రజలు ఆ సిద్ధులు సాంగత్యంతో పునీతులు అవుతు ఉంటారు. ఆత్మ ఙ్ఞానం పెంపొందించుకునేవాతావరణం సిద్ధ పురుషుల ఆశ్రమాలలో లభించగలదు. అట్టి మహాపురుషుల ఉనికి అన్ని రకాల తాపత్రయాలను పారద్రోలి సాశ్వతమైన ఆధ్యాత్మిక శాంతిని చేకూర్చుతుంది. నిరంతరం సంసారవ్యామ్మోహంలో కొట్టుమిట్తాదే నేటి ప్రజలు, అట్టి మహాపురుషుల సాంగత్యం కొరకై తరచు ప్రయత్నం చేయ్తుట వలన శాంతి సౌఖ్యాలను పొందగలరు. పలు సిద్ధ పురుషుల జీవిత చరిత్రలు దీనికి ఉదాహరణలు ! శ్రీ రామ జయ రామ జయ జయ రామ !
కామెంట్లు