వాల్మీకి జయంతి

 వాల్మీకి జయంతి


ఒక బోయవాడు, రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించి, ఆదికవిగా మారిన వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

వాల్మీకి అంటే మనకు, పరమ రామ భక్తుడిగా, రామ నామాన్ని తపస్సు చేసే వారుగా తెలుసు. అయితే, వాల్మీకి మహర్షి గురించి స్కూల్ పుస్తకాల్లో చదివింది మాత్రమే నిజం కాదు. వాల్మీకి అనే శబ్దము, చీమలపుట్ట అనే అర్థానికీ, కఠోర ధ్యానానికీ, నిశ్చల తపోముద్రకు ప్రతీక. అట్టి తపోః ఫలితమే వాల్మీకి మహాకవి.

అటవీ తెగకు చెందిన వాల్మీకి, కరువు వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి ఆనాటి దండకార్యణమైన నల్లమల అడవుల గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులూ, దుంపలూ తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణ కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తాను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విశ్లేషకుల భావన.

వాల్మీకి మహర్షిని ఆదికవీ, ఋక్షకుడూ, భార్గవుడూ, కవికోకిలా, వాక్యావిశారదుడూ, మహాజ్ఞానీ, భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకి మహర్షి, “ఓం  ఐ౦ హ్రీం క్లీ౦ శ్రీ౦” అనే బీజాక్షరాలు సరస్వతీ, లక్ష్మి దేవి కటాక్షాన్ని కలుగచేస్తాయని లోకానికి పరిచయము చేశారు. దేవిభాగవతము, వేదవ్యాసవిరచితము, తెలుగు అనువాదము చేశారు.    


వాల్మీకి మహర్షి జీవించిన కాలముపై అనేక పరిశోధనలు జరిగాయి. వాల్మీకి రామాయణము, సామాన్య శక పూర్వం 1000వ సంవత్సర ప్రారంభములో రచింపబడి వుంటుందని, వాల్మీకిపై విశేష పరిశోధనలు గావించిన జి.ఎస్. ఆల్టేకర్ (1895-1987) నిర్దారించారు. సామాన్యశక పూర్వం 100 సంవత్సరములకు చెందిన బుద్ధచరిత్ర రచయత అశ్వఘోషుడు, వాల్మీకి ఆదికావ్యాన్ని గూర్చి ప్రశంశిస్తూ ఇలా వ్రాశాడు.

”వాల్మీకి రాదే చ ససర్జపద్యం జగ్రంధన్నచ్యవనో మహర్షి”- ఈ శ్లోకం వాల్మీకి సామాన్య శకానికి ముందువాడని ధ్రువ  పరుస్తోంది. బుద్ధునికి పూర్వము అంటే సామాన్య శక పూర్వం 800సంవత్సరాల నాటి వాడు వాల్మీకి అని డా.హెచ్.జాకోబి అభిప్రాయము. 

మన పురాణ ముఖ్య ఇతిహాసమైన రామాయణాన్ని మన తరతరాలకు అందించిన గొప్ప రచయత వాల్మీకి జయంతిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయం. నేటి తరానికి ఆయన అందించిన రచనా కుసుమాలు అనిర్వచనీయం....
కట్టర్ హిందూ...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.