ద్రౌపదికి ఐదుగురు భర్తలుండడంలో రహస్యమేదైనా ఉందా?
*ధర్మసందేహం - సమాధానం*
సందేహం;- ద్రౌపదికి ఐదుగురు భర్తలుండడంలో రహస్యమేదైనా ఉందా?
సమాధానం;- రహస్యం ఏమీ లేదు కాని పంచేంద్రోపాఖ్యానం అని ఒక కథ ఉందని వ్యాస మహర్షి చెప్పాడు.
ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి శివుడు ఇంద్రుని ఐదు అంశలను స్తంభింపజేస్తాడు. ఇంద్రుడు శరణు వేడగా *నీవు ఐదు అంశలతో భూలోకంలో పంచపాండవులుగా అవతరించి ఎన్నో సాహస కృత్యాలను, సత్కార్యాలను చేసి తిరిగి ఇంద్రలోకాన్ని చేరుకోగలవు* అని పరమశివుడు ఆజ్ఞాపిస్తాడు.
అప్పుడు విశ్వభుక్, భూతధామా, శిబి, శాంతి, తేజస్వి అనే ఐదు ఇంద్రాంశలు ధర్మదేవత, వాయువు, ఇంద్రుడు, అశ్వని దేవతల అంశలతో పంచపాండవులుగా అవతరిస్తారు.
స్వర్గలక్ష్మి అయిన శచీదేవి ద్రౌపదిగా ఈ ఐదుగురికి భార్య అవుతుంది. ఐదుగురిగా కనబడినా ఇంద్రుడొక్కడే అయినట్లు, ఇంద్రుని సతీమణి శచీదేవి ద్రౌపదియై పతివ్రతా శిరోమణిగా ప్రసిద్ధికెక్కింది.
శిష్ఠ రక్షణకు దుష్ట శిక్షణకు తోడ్పడింది.
*సర్వేజనా సుఖినో భవంతు*
కామెంట్‌లు