మంథని క్షేత్ర మాహాత్మ్యం

🌻🙏 *మంథని క్షేత్ర మాహాత్మ్యం* 🙏🌻

🌷ఆకాశాన్ని స్పృశించాలనుకోవడం, నక్షత్రాలను లెక్కించాలనుకోవడం,సప్త సముద్రాలను ఏకధాటిగా ఈదాలనుకోవడం, లక్ష సింహాల మధ్యన కూర్చొని పంక్తి భోజనం చేయాలనుకోవడం ఇవేవీ సాహసాలు కావు...!!!

👉ప్రశ్న : మరి ఏది సాహసం ...???

🌹జవాబు : మంథని క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని మాటల్లో  వివరించాలనుకోవడం ,అక్షరాల్లో బంధించాలనుకోవడం  అవును ఇది నిజం...!!!

🌷ఇక్కడ ప్రతీ చెట్టూ పరదేవతయే , ప్రతీ పుట్టా పరాభట్టారికయే , ప్రతీ అణువు అమ్మ స్వరూపమే...!!!

🌷విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే  అందులో పూజా మందిరమే ఈ మంథని క్షేత్రం...!!!

🌷మంథని, "కేవల గ్రామం కాదు అది ముక్తిధామం" ...!!!

🌷చందమామ కావాలని ఏడ్చిన బిడ్డడికి అద్దంలో చూపించి అమ్మ అన్నం పెట్టిన మాదిరి , స్వర్గం ఎలా ఉంటుందో చూస్తాననుకునే ఆస్తికులకి పరమాత్ముఁడు భూమిపై ఉన్న మంథని క్షేత్రాన్ని చూపిస్తాడు...!!! 

🌷మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". అనగా ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి".ఇక్కడ ప్రతీ గృహం ఓ మంత్రస్వరూపమైతే, ఆయొక్క గృహాల్లో నివసించే ప్రతీ వ్యక్తి ఓ బీజాక్షర స్వరూపం...!!!

🌷జీవులు లక్షల జన్మలలో పుణ్యం చేస్తే మనుషులుగా   పుడతారు.కోట్ల జన్మలలో పుణ్యం చేస్తే భరత ఖండంలో పుడతారు.అనంతకోటి జన్మలలో పుణ్యం చేస్తే మంథని క్షేత్రంలో జన్మిస్తారు.ఇది నిత్యసత్యం...!!!

🌷చిదజ్ఞికుండ సంభూతయైన శ్రీ లలితాదేవిని ధ్యానించడానికి సహస్రనామాలు ఉన్నాయి , ఈ సహస్ర నామాలే సహస్ర విప్ర గడపలుగా ఏర్పడ్డ అద్భుత క్షేత్రం మన మంథని క్షేత్రం...!!!

🌷నిష్కల్మష భక్త జనులతో, లౌకిక వాంఛల త్యాగధనులతో,  పరమశివుణ్ణి సైతం ప్రసన్నం చేసుకోగల సాధనా ఘనులతో నిత్యం శోభిల్లే మహిమాన్విత క్షేత్రం మన మంథని క్షేత్రం...!!!

🌷ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉన్న అయ్య ప్రేమ, అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న అమ్మప్రేమల కలబోత కుండపోతగా వర్షించే గొప్ప తపో భూమిగల క్షేత్రం మన మంథని క్షేత్రం...!!!

🌷ముక్కోటి దేవతల అనుగ్రహ అతివృష్టి క్షేత్రం , కలిపురుషుని కల్మష జల్లుల అనావృష్టి క్షేత్రం , మన మంథని క్షేత్రం...!!!

🌷జపమాల పట్టిన సాధకులకు యోగనిద్రలో జోల పాడుతుంది, కమండలం చేతపట్టిన యోగులకు భానుమండల తేజస్సుని అనుగ్రహిస్తుంది మన మంథని క్షేత్రం...!!!

🌷ఇక్కడ భూమి పొరల కంపనాలు ఓంకారాన్ని ప్రతిధ్వనిస్తాయి, భూగర్భ జలాలు వేదమాత పాదాలను అభిషేకిస్తాయి...!!!

 🌷 *డా .శివ ప్రసాద శాస్త్రి* 🌷

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.