అర్ధకుంభమేలా..ప్రయాగరాజ్ 2019

*అర్ధకుంభమేలా..ప్రయాగరాజ్ 2019.*


కుంభమేలా అనగానే నాగసాధువుల స్నానాలు, 

వాళ్ళు చేసే విన్యాసాలు గుర్తుకువస్తాయి. 


*ఈ కుంభమేలా 15 జనవరినాడు 13 అఖాడాలనుండీ వచ్చే సాధువుల స్నానాలతో ప్రారంభమౌతుంది.*


అఖాడా అనే పదానికి అర్థం మల్లయుద్ధవేదిక. 

ఆంగ్లంలో arena అంటారు. 

మనవైపు వ్యాయామకళాశాలలో మల్లయుద్ధం చేసే స్థలాలవంటివన్నమాట....

ఎక్కడ , ఎప్పుడు కుంభమేళా జరిగినా 

ఈ 13 అఖాడాలసాధువులు వెళ్ళి మొదటగా స్నానం చేయడం ఆనవాయితీ.  


వాళ్ళు ఎవరో చూద్దాం.....


*1. జూనాఅఖాడా.💐*


దీని ప్రధానకార్యాలయం కాశీలో ఉంది. 

ఇందులో సుమారు 4 లక్షల సాధువులు ఉన్నారు. 

ఇదే అతిపెద్ద అఖాడా. 

వీరి ఇష్టదైవం దత్తాత్రేయుడు. 

ఇందులో మహిళా సాధ్వీమణులు కూడా ఉన్నారు. 

వీరికి నివాసం (మాయీబాడా) విడిగా ఉంటుంది. ఇందులో ఎంతోమంది విదేశీ సాధువులు కూడా 

ఉండటం విశేషం.


*2.అటల్ అఖాడా.💐*


వీరి ఇష్టదైవం గణపతి. 

ఇందులో సుమారు 700 మంది సాధువులున్నారు. 

దీని ప్రధాన కార్యాలయం కూడా కాశీలోనే ఉంది. 

ఇందులో మహిళలు ఉండరు. 

వీరు "బల్లెం" ను ఆయుధంగా పూజిస్తారు. 

ఆబల్లెంనకు 'సూర్యప్రకాశ్ ' అనిపేరు. 

వీరివద్ద ధర్మధ్వజం, 

పర్వధ్వజం 

అనే 2 జెండాలుంటాయి. 

కుంభమేళాలో ధర్మధ్వజంతో ప్రవేశించి , 

పర్వధ్వజంతో స్నానం చేస్తారు.


*3.ఆనంద్ అఖాడా.💐*


ఇది కూడా కాశీలోనే ఉంది. 

వీరి ఇష్టదైవం సూర్యభగవానుడు.


*4.ఆహ్వాన్ అఖాడా.💐*


ఇది కాశీలోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద ఉన్నది. 

గణపతి వీరి ఇష్టదైవం. 

ఇందులో సుమారు 12,000 మంది సాధువులున్నారు. ఇందులోకూడా 'బల్లెం' ను పూజిస్తారు.


*5.నిరంజనీ అఖాడా..💐*


వీరి ఇష్టదైవం కార్తికేయుడు. 

గాయత్రీదేవి మరియు అగ్నిదేవుడు వీరి ఇష్టదైవాలు.

ఇది ప్రయాగరాజ్ లోనే ఉంది. 

ఇందులో సుమారు 10,000 మంది సాధువులున్నారు.


*6.మహానిర్వాణీ అఖాడా.💐*


ఇది కూడా ప్రయాగరాజ్ లోనే ఉంది. 

వీరి ఇష్టదైవం కపిలముని. 

ఇందులో సుమారు 6,000 మంది సాధువులున్నారు. వీరికి కూడా రెండురకాల ధ్వజాలున్నాయి.


*7.పంచాగ్ని అఖాడా.💐*


ఇది కాశీలో ఉంది. 

ఇందులోకూడా అగ్నిని, గాయత్రీదేవిని పూజిస్తారు. సుమారు 3,000 మంది సాధువులున్నారు.


*8.దిగంబర అఖాడా.💐*


వీరి ఇష్టదైవం బాలానందస్వామి. 

ఇందులో మహిళలు ఉండరు.


*9.నిర్మోహీ అఖాడా.💐*


రామానందాచార్య దీనిని స్థాపించారు. 

హనుమంతుడు వీరి ఇష్టదైవం. 

ఇందులో సుమారు 15,000 మంది సాధువులున్నారు.


*10.నిర్వాణీ అఖాడా.💐*


వీరి కార్యాలయం అయోధ్య లో ఉంది. 

ఇష్టదైవం హనుమంతుడు. 

వీరంతా ఊర్ధ్వత్రిపుండ్రం ధరించి ఉంటారు.


*11.పంచాయతీ బడా ఉదాసీన్ అఖాడా.💐*


ఉదాసీన సంప్రదాయవాదులైన వీరు పంచాయతన దేవతలను పూజిస్తారు. 

ఇందులో 20,000  మంది సాధువులున్నారు. కార్యాలయం ప్రయాగరాజ్ లోనే ఉంది.


*12. పంచాయతీ నయా ఉదాసీన్ అఖాడా..💐*


ఉదాసీన సంప్రదాయవాదులైన వీరి కార్యాలయం హరిద్వార్ లోని కనఖల్ లో ఉంది. 

వీరు సుమారు 5,000 మంది ఉన్నారు.  

వీరుకూడా పంచాయతన దేవతలను పూజిస్తారు.


*13.నిర్మల్ అఖాడా.💐*


సిక్కు సంప్రదాయంతో ముడివడిన ఈ అఖాడాను గురుగోవింద్ సింగ్ మిత్రుడైన వీరసింహుడు స్థాపించాడు. ఇది హరిద్వార్ లో ఉంది. 

ఇందులో మహిళాసాధంవులుండరు. 

వీరు గురుగ్రంథ్ సాహెబ్ ని పూజిస్తారు.

ఓం నమః శివాయ..!!🙏


*💐లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.