నిర్జల ఏకాదశి

నిర్జల ఏకాదశి                                         



సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే చాల శక్తివంతమైన పవిత్ర ఏకాదశి. ఈరోజంత భగన్నామ స్మరణ, ఉపవాసం, విష్ణు దేవాలయ సందర్శనం చాలా మంచి ఫలితం ఇస్తుంది.


ఏదైనా ఇబ్బంది వలన సంవత్సరంలో మిగతా 23 ఏకాదశి ఉపవాసాలు చెయ్యలేకపోతే ఈ నిర్జల ఏకాదశి చేస్తే చాలు 24 ఎకాదశులు చేసిన ఫలితం ఉంటుంది. 

దగ్గర్లో ఉన్న విష్ణు దేవాలయాలను దర్శించుకోవటం మంచి ఫలితం ఇస్తుంది. విష్ణు సహస్రనామం, భాగవతం వినటం, చదవటం చాల శ్రేయస్కరం. మనసులో రోజంతా హరినామ స్మరణ చేయడమే నిజమైన ఏకాదశి.

నిర్జల ఏకాదశి ప్రత్యేకతలు :-

1 .వేదవ్యాస మహర్షిలవారు భీమునికి చెప్పినవిధంగా నిర్జల ఏకాదశి ఉపవాసం చేసినవాళ్ళకి సంవత్సరం లో ఉన్న అన్ని ఎకాదశుల ఫలితం ఉంటుంది. 
2 . గతంలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు దగ్ధమైపోతాయి. 
3 . విష్ణు భగవానుడి అనుగ్రహం, సిరి సంపదలు, ఆరోగ్యం, సంతానం, ఉద్యోగంతో చక్కగా వర్ధిల్లుతారు.

సర్వేజనా సుఖినోభవంతు - సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.