పోస్ట్‌లు

జూన్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
శ్రీ కృష్ణావతారం 1 సకల పురాణాలనూ వ్యాఖ్యానించటంలో నైపుణ్యం గల సూతమహర్షి, గొప్ప గుణాలచేత ఉత్తములైన శౌనకాది మహర్షులతో ఈ విధంగా అన్నాడు. "పరీక్షిన్మహారాజు శుకమహర్షిని చూసి ఇలా పలికాడు. నీవు సూర్యవంశ చంద్రవంశాల విస్తారాలను తెలియ జెప్పావు. ఆ వంశాలలో పుట్టిన రాజుల చరిత్రలు చక్కగా చెప్పావు. మేము విన్నాము. వారి చరిత్రలలో ఉన్న విశేషాలు మాకు చాలా విభ్రాంతిని కలిగించాయి. శ్రీమహా విష్ణువు మహాత్ముడూ, ఈ లోకాలకు ఈశ్వరుడూ. ఆయన శీలవంతమైన యదువంశంలో ఎందుకు పుట్టాడు. అలా పుట్టి ఏవిధంగా ప్రవర్తించాడు. ఏ ఏ వేళల్లో ఏమేమి పనులు చేసాడు. ఈ విషయాలన్నీ వివరంగా చెప్పవలసింది. శ్రీహరి అయిన విష్ణుమూర్తి స్తోత్రం సంసారబాధలకు ఔషధం. చెవులకు మనసుకు ఆనందం కలిగిస్తుంది. మోక్షం అర్థించే జనులకు కోరదగినది. అటువంటి హరిస్తోత్రం విని ఇంకచాలు అనేవాడు ఎవడూ ఉండడు. మూర్ఖుడో కసాయివాడో అయితే తప్ప ఆమాట ఎవరూ అనరు. భీష్మాది కురువీరులతో నిండిన కౌరవసైన్యాన్ని తట్టుకోవడం దేవతలకు అయినా సాధ్యం కానిది. అలాంటి కౌరవసేనాసముద్రాన్ని మా పెద్దలైన పాండవులు ఒక పసిపిల్లవాడి అడుగును దాటినంత సులభంగా ఎలా దాటగలిగారు. ఏ తెప్ప సహాయంతో దాటగలిగారు. నేన