పితృ పక్షం లేదా మహాలయ పక్షం మహాలయమంటే!

పితృ పక్షం లేదా మహాలయ పక్షం
మహాలయమంటే!



భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులు. దీన్ని పితృపక్షంగా మహాలయంగా చెప్తారు.

‘‘ఆషాఢీ మవధిం కృత్వా పంచమంపక్ష మాశ్రీతాః
కాంక్షంతి పితరః అన్న మప్యస్వహం జలమ్‌.’’

మన పితృదేవతలు ‘ఆషాఢమాసము రెండు పక్షము లు మెదలు తిరిగి భాద్రపద కృష్ణ పక్షము’ వరకు గల ఐదుపక్షములు మన పితృదేవతలు ఎన్నో ఇక్కట్లు పాలగుచుందురట!

అందులకుగల కారణం సూర్యుడు కన్యా తులారాసుల నుండి వృశ్చికరాశి వచ్చువరకు ప్రేతపురి శూన్యముగా నుండునని; అందువల్ల ఆ కాలమందు మన పితృదేవతలు అన్నోదక ములు కాంక్షిస్తూ భూలోకమున వారివారి గృహముల చుట్టు ఆత్రంగా తిరుగుచుందురు అనియు మహాభారతము పేర్కొనుచున్నది.

అందువల్లనే మరణాంతరము నిర్వర్తించే ఈ కర్మలకు అంతటి ప్రాధాన్యత కలిగి యున్నది కాబట్టి, అంత్యకాలమందు ‘కర్ణుడు’ కృష్ణ పరమాత్మను చివరిగా ఒక కోరిక కోరినాడట.
కృష్ణా ! ‘‘నా జన్మవృత్తాంత రహస్యము దయతో ధర్మరాజుకు సవిస్తరముగా వివరించి వానిచే తనకు పిండప్రదానములు గావించమని’’ కోరినాడుట!

ఆ కర్ణుని కోరికను పరమాత్మ అంగీకరించి ధర్మరాజుచే ఆకార్యక్రమము చేయించినాడుట!
అలా ధర్మరాజు యుద్ధంలో మరణించిన 77 వేలమందికి పిండప్రదానాదులు గావించి వారికి సద్గగతులు కల్పించినాడు. కావున ఈ శ్రాద్ధకర్మలు నిర్వర్తించుట అనునది మానవుల యొక్క విధి అని పురాణాది గ్రంథాలు చెబుతున్నాయి.

ఇందు ప్రతిఫలం ఆశించరాదు. నూరు యజ్ఞాలు చేయడం కన్న, మన వంశ వృక్షానికి కారకులయిన "పితృదేవతల తర్పణాలే "ఎంతో ముఖ్యమైనవిగా చెప్పబడినవి.

ఈ విషయమందు అలక్ష్య భావన ఎంతమాత్రము కూడదు అని దైవజ్ఞులు చెప్తారు.పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశవృద్ధి , సంతాన వృద్ధి కలగడమే కాకుండా సంతానానికి సద్బుద్ధి కలుగుతుంది.

మాతాపితరలను కలిపి పితరులు అంటాము. వారిని సరిగ్గా చూసుకుని ఆనందపరిస్తే వారు ఆనందించడమేకాక పితృదేవతా వ్యవస్థ ఆనందిస్తుంది.

మరి దేవతలకు ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి.
మరి పితృదేవతలకు..?.. ఉన్నాయి.
పురాణాలలో `పితృస్తుతి` అనేది ఉంది.
 ఇది చాలా మహిమాన్వితమైనది. దీనిని ప్రతిరోజూ లేదా పితృ పక్ష దినములందు చదువవలెను.

ముఖ్యంగా ఈ స్తోత్రాన్ని పఠిస్తే వంశపారంపర్య పితృ దోషాలు తొలిగి పోతాయి. పితృదోషం ఉన్న వారికి అనేక కష్టాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా ఏదో కారణంగా పితృ సౌఖ్యం, సంతాన సౌఖ్యం , దాంపత్య సౌఖ్యాలకు భంగం కలుగుతుంది. ఎన్ని తెలివితేటలు ఉన్నా రాణించే అంతగా రాణించలేకపోతారు.

 ఈ క్రింది స్తోత్రం ప్రతిరోజూ చదవడం వాళ్ళ పితృ దోషాలు తగ్గుతుంటాయి.
పితృదేవతల అనుగ్రహం ఉంటే అందరు దేవతల అనుగ్రహం కూడా ఉన్నట్లే!

పితృ స్తోత్రం
1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయచ౹ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే౹౹
2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గీయ పరమేష్ఠినే౹ సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయచ౹౹
3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయతే నమః౹ సదాపరాధక్షమినే సుఖాయ సుఖదాయచ౹౹
4. దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపు౹ సంభావనీయం ధర్మార్ధే తస్మై పిత్రే నమోనమః౹౹
5. తీర్థస్నానతపోజపాది యస్య దర్శనం మహాగురోశ్చగురవే తస్మై పిత్రే నమోనమః౹౹
6. యస్య ప్రణామస్తవనతః కోటిశః పితృతర్పణం అశ్వమేధశతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః ౹౹
ఫలశ్రుతి:
(1) ఇదం స్తోత్రం పుణ్యం య:పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధ దినోపివా
(2) స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా నతస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞతాది వాంఛితం
(3) నానాపకర్మక్రుత్వాభి య:స్తౌతి పితరం సతః సధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్.
పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి౹౹

-సేకరణ


వాట్సాప్ ఛానల్ లింక్ ☝🏻

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.